Appadam benefits: రోజూ ఓ అప్పడం తినండి, ఈ లాభాలన్నీ పొందొచ్చు

Best Web Hosting Provider In India 2024

కూర, పప్పు ఉంటే మనకు సరిపోదు. పక్కన కరుం కురుం అనే అప్పడాలు, వేపుడు కూరలు, మురుకులు.. ఇలా ఏదైనా నంచుకోడానికి ఉండాల్సిందే. రసం, సాంబార్ లాంటివి చేసినప్పుడు అన్నంతో పాటూ నంచుకోడానికి పక్కాగా అప్పడాలు వేయిస్తారు. అప్పడాల్లో రకరకాలున్నా వాటిలో ఆరోగ్యకరమైనవి మాత్రం పెసరపప్పుతో చేసిన అప్పడాలు. బజార్లో మనకు దొరికేవన్నీ దాదాపుగా పెసరపప్పుతో చేసినవే. అయితే కేవలం రుచి కోసమే కాకుండా రోజూ ఓ అప్పడం తిన్నారంటే మీకు కలిగే ప్రయోజనాలేంటో తెల్సుకోండి.

అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలు:

పెసర అప్పడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. ఈ రుచికరమైన స్నాక్ వల్ల అనేక ఆరోగ్య రుగ్మతలు తగ్గుతాయట. దీని ప్రయోజనాలేంటో చూద్దాం.

ఆకలి పెంచుతాయి:
భోజనం చేయడానికి ముందు తింటే అప్పడాలు ఆకలి పెంచే అపిటైజర్ లాగా పనిచేస్తాయి. ఒంట్లో బాగా లేనప్పుడు, ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినాలనిపించదు. ఆకలి వేయదు. అలాంటప్పుడు వేయించిన, లేదా కాల్చిన పెసర పప్పు అప్పడం తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. మరింత తినాలనే కోరిక పెరుగుతుంది.

జీర్ణశక్తి:

కొన్ని ఆహారాలు తిన్న తర్వాత గొంతులో, నోటిలో కొవ్వు పేరుకుంటుంది. అలాంటి భోజనం చేసిన తర్వాత అప్పడం తింటే నోరు, గొంతులో ఉండే అదనపు కొవ్వు తగ్గుతుంది. అప్పడాల తయారీ కోసం పెసరపప్పుతో పాటే నల్ల మిరియాలు, వాము, కొద్దిగా ఉప్పు కలిపి తయారు చేస్తారు. దీని వల్ల ఈ అప్పడాలు ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి. కాస్త మసాలాలు ఎక్కువగా ఉన్న భోజనం తిన్నప్పుడల్లా చివర్లో అప్పడాలు ఇవ్వడానికి కారణం కూడా ఇదే. అలా తింటే కొవ్వులు, మసాలాలు సులభంగా జీర్ణం అవుతాయి.

కంటి, చెవి రుగ్మతలు:
కంటి సంబంధిత ఆరోగ్య రుగ్మతలు, చెవికి సంబంధించిన వ్యాధులను కూడా పెసర అప్పడం తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అప్పడాలు ఎవరు తినకూడదు?

వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తపోటు ఉన్న రోగులు అప్పడాలు తక్కువగా తినడం మేలు. రుచి కోసం ఎక్కువగా తింటే ఎసిడిటీ ఏర్పడే ప్రమాదం ఉంది. దాంతో పాటూ దీంట్లో ఉండే సోడియం ప్రభావం రక్తపోటు మీద పడుతుంది.
అప్పడాలను నేరుగా కాల్చి తినడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దానికోసం పుల్కాలు చేసే స్టాండ్ వాడొచ్చు. లేదంటే ఒక కడాయిలో నిండా ఉప్పు పోసి అది వేడెక్కాక అందులో అప్పడం వేసి పైకి కిందికి అంటే కూడా అప్పడం వేగిపోతుంది. నూనెలో వేయించడం వల్ల వాటి గుణాలు కాస్త తగ్గిపోతాయి.

 

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024