TGPSC Polytechnic Lecturers : ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ల సెలక్షన్ లిస్ట్ విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులకు ప్రాథమిక ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సబ్జెక్టుల పోస్టులకు ఎంపికైన ప్రాథమిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in ను సందర్శించవచ్చు.

గత ఏడాది సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు రాత పరీక్షలను నిర్వహించారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు టీజీపీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించింది. తాజాగా ప్రాథమిక జాబితాను విడుదల చేసింది. హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన ఫైనల్ కాదని బోర్డు తెలిపింది. నియామక అధికారి అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవే అని నిర్థారించడం, ఇతర విషయాలు పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల చేస్తారు. ఎవరైన తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారేమోనని అధికారులు పరిశీలిస్తారు. ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పిస్తే వారిపై ఏ దశలోనైనా టీజీపీఎస్సీ చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. వారి ఎంపిక రద్దు సహా టీజీపీఎస్సీ తగిన చర్యలు తీసుకుంటుంది.

247 లెక్చరర్ల పోస్టులు

తెలంగాణలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల లెక్చరర్ల పోస్టు భర్తీకి టీజీపీఎస్సీ 2023 సెప్టెంబర్ లో రాత పరీక్ష నిర్వహించింది. ఈ రాత పరీక్ష ర్యాకింగ్ జాబితాను ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రకటించింది. అభ్యర్థుల ర్యాంకింగ్ జాబితాను సబ్జెక్టుల వారీగా టీజీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ల పోస్టుల భ‌ర్తీకి 2023లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 స‌బ్జెక్టుల్లో లెక్చరర్ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయనున్నారు.

టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులకు టీజీపీఎస్సీ గత ఏడాది సెప్టెంబర్ 4 నుంచి 6 , 8వ తేదీన రాత పరీక్ష నిర్వహించింది. ఈ రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల సాధారణ ర్యాంకింగ్ జాబితా, అనంతరం మెరిట్ జాబితాను ప్రకచించారు. తాజాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత ప్రాథమిక ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి.

  • టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://websitenew.tspsc.gov.in/ పై క్లిక్ చేయండి.
  • హోం పేజీలో పాలిటెక్నిక్ లెక్చరర్ రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి
  • మెరిట్ జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది
  • మెరిట్ జాబితాలో మీ రోల్ నంబర్‌ను చెక్ చేసుకోండి.
  • భవిష్యత్తు అవసరం కోసం ఫలితాల PDFని డౌన్‌లోడ్ చేయండి

పాలిటెక్నిక్ లెక్చరర్ల ప్రాథమిక ఎంపిక జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

TspscJobsTelangana NewsTrending TelanganaTelugu NewsHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024