రెడ్‌బుక్ రాజ్యాంగంతో కూట‌మి నేత‌లు భ‌య‌పెడుతున్నారు

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు

శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం విఫ‌లం

దిశా యాప్‌తో వైయ‌స్ జ‌గ‌న్ మ‌హిళ‌ల‌పై దౌర్జ‌న్యాలు అరిక‌ట్టారు

కూట‌మి పాల‌న‌లో హ‌త్య‌లు, అత్యాచారాలు పెరిగిపోయాయి

తాడేప‌ల్లి: రెడ్‌బుక్ రాజ్యాంగంతో కూట‌మి నేత‌లు భ‌య‌పెడుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు మ‌డిప‌డ్డారు. ఏపీలో మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు పెరుగుతూ ఉంటే ప్ర‌భుత్వ చ‌ర్య‌లు మాత్రం శూన్య‌మ‌ని సుధాక‌ర్‌బాబు విమ‌ర్శించారు. రాష్ట్రంలో చిన్నారులు, మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడులు, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌పై అక్ర‌మ అరెస్టుల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సుధాక‌ర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

సుధాక‌ర్‌బాబు ఏమ‌న్నారంటే..
రెడ్‌బుక్ రాజ్యాంగంతో కూట‌మి నేత‌లు భ‌య‌పెడుతున్నారు. ఎక్కువ కేసులు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌పై ఒత్తిడి చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు గంగ‌లో క‌లిపారు. శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో కూట‌మి స‌ర్కార్ విఫ‌ల‌మైంది. రాష్ట్రంలో గ‌త ఐదేళ్లు ఏ అన్యాయం జ‌రిగినా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది.  

కూటమి సర్కార్ లో మహిళలకు రక్షణ కరువైంది. బాలిక‌ల‌ను, చిన్నారుల‌ను హ‌త్య చేసి ఎక్క‌డో పొలాల్లో పారేస్తున్నారు. నేరాలు చేయాల‌నే ఆలోచ‌న ఉన్న వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. నేర‌ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన వారిపై ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. ముచ్చుమ‌ర్రిలో చిన్నారిని హ‌త‌మార్చిన ఘ‌ట‌న‌లో ఇంత‌వ‌ర‌కు ఆమె డెడ్‌బాడీ ఏమైందో చెప్ప‌డం లేదు. ఏమైందో చెప్ప‌డం లేదు. ఆ త‌ల్లిదండ్రుల మాన‌సిక క్షోభ ఎలా ఉంటోందో తెలుసా చంద్ర‌బాబు. ఇంటి ముందు  ఆడుకుంటున్న అమ్మాయి ఏమైందో తెలియ‌క త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. 

పిఠాపురంలో టీడీపీ నేత 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేస్తే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఈ నాలుగు నెల‌ల పాల‌న‌లో చిన్నారులు, మ‌హిళ‌ల‌పై 74 ఘ‌ట‌న‌లు జ‌రిగాయంటే..రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో ప్ర‌భుత్వానికి తెలుస్తుందా? ఇది ఒక చీక‌టి పాల‌న‌గా మేం భావిస్తున్నాం. రాజ్యంలో రాజుకు అవ‌గాహ‌న లేక‌పోతే..పాల‌న ఎలా సాగుతుంది. స్వ‌యాన అధినేత స్థాయిలోనే నేరాల‌ను ప్రోత్స‌హిస్తుంటే ఇక ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ ఎలా ఉంటుంది. ఇలాంటి నేరాలు, ఘోరాలు జ‌రుగుతుంటే ఇంకా ఈ ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు. కేవ‌లం త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం, త‌ప్పుడు కేసులు పెట్ట‌డం ఈ ప్ర‌భుత్వానికి అల‌వాటుగా మారింది. వీట‌న్నింటిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు.

నిన్న నందిగం సురేష్‌పై అక్ర‌మ కేసు బ‌నాయించి జైల్లో పెట్టారు. ఇవాళ మాజీ మంత్రి పెనిపే విశ్వ‌రూప్ కుటుంబాల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. ద‌ళిత నాయ‌కుల‌పైనే కూట‌మి స‌ర్కార్  దాడులు, క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. మీ చేత‌నైతే ద‌ళిత నాయ‌కుల‌ను ప్రోత్స‌హించండి. ద‌ళితుల‌ను ఇబ్బందుల‌పాలు చేయ‌డం స‌రికాదు. ఎన్ని కేసులు పెట్టినా మేం భ‌య‌ప‌డం. రాజ్యాంగం ర‌చించిన డాక్ట‌ర్ అంబేద్క‌ర్ స్ఫూర్తితో పోరాటం చేస్తాం. 

పోలీసు వ్య‌వ‌స్థ పూర్తిగా విఫ‌ల‌మైంది. అధికార ప‌క్షానికి కొమ్ము కాస్తోంది. ఎప్పుడు లేని జాఢ్యం పోలీసు వ్య‌వ‌స్థ‌కు అంటుకుంది. ప్ర‌భుత్వ చేత‌కాని త‌నంతో పోలీసులను ముందుంచి దాడులు చేయిస్తోంది. అక్ర‌మ కేసులు పెట్టిస్తోంది. రాజ్యాధికారం ఎప్పుడూ ఏ ఒక్క‌రి చేతిలో ఉండ‌ద‌న్న‌ది ప్ర‌తి ఒక్క‌రూ గుర్తించుకోవాలి. వైయ‌స్ఆర్‌సీపీ రెడ్‌బుక్ రాజ్యాంగం అమ‌లు చేయ‌దు. మాపై ఎన్ని కేసులు పెట్టినా మేం భ‌య‌ప‌డేది లేదు. 

దిశ యాప్ అమ‌లులో ఉండి ఉంటే ఇలాంటి నేరాలు ఘోరాలు జ‌రిగేవి కాదు. మ‌న దేశంలో 1.05 కోట్ల మంది రాష్ట్రంలో మ‌హిళ‌లు దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఎస్‌వోఎస్ బ‌ట‌న్‌ను ఒక్క‌సారి ఊపితే 5 నిమిషాల్లో పోలీసులు మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచేవారు. ఇలాంటి వ్య‌వ‌స్థ‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్వీర్యం చేసింది. కూట‌మి స‌ర్కార్ తీరు మార్చుకోక‌పోతే ప్ర‌జా ఉద్య‌మం ఉధృతం చేస్తామ‌ని సుధాక‌ర్‌బాబు హెచ్చ‌రించారు.

Best Web Hosting Provider In India 2024