Veekshanam Reviews: ఈ రేంజ్‌లో ఊహించలేదు.. చాలా మంచి పాజిటివ్ రివ్యూలు.. హీరో రామ్ కార్తీక్, డైరెక్టర్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Veekshanam Movie Reviews: యంగ్ హీరో రామ్ కార్తీక్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వీక్షణం. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కశ్వి యాక్ట్ చేసింది. అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇంత పెద్ద సక్సెస్

ఈ నేపథ్యంలో వీక్షణం థ్యాంక్స్ మీట్ సమావేశం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. “చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతుందని తెలుసు. కానీ ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది. మొన్న గురువారం (అక్టోబర్ 17) ప్రీమియర్ షో దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇదే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్‌కి వచ్చి మూవీ చూసి మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పెద్ద థ్యాంక్స్” అని తెలిపారు.

పాజిటివ్‌గా ఉంది

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. “ముందుగా మా సినిమాను ఇంతలా జనాల్లోకి తీసుకువెళ్లిన మీడియా వాళ్లకు, సినిమాను చూసి ఆదరించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. నేను కూడా నిన్న కొన్ని థియేటర్స్‌కి వెళ్లాను. అక్కడ అంతా చాలా పాజిటివ్‌గా ఉంది. మా సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్” అని అన్నాడు.

మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ.. “అందరికి చాల పెద్ద థ్యాంక్స్. రివ్యూస్ కూడా చాల బాగా వచ్చాయి. చాల హ్యాపీగా ఉంది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చాలా చాలా థ్యాంక్స్” అని చెప్పుకొచ్చారు.

మొదటి సినిమాకే

నటుడు శ్రీరామ్ మాట్లాడుతూ.. “ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, మీడియా వాళ్లకు చాలా థ్యాంక్స్. ఇది నా ఫస్ట్ సినిమా. నా మొదటి సినిమాకే ఇంతమంది ప్రేమ నాకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నన్ను ఈ పాత్రకు సెలెక్ట్ చేసిన డైరెక్టర్ మనోజ్ అన్నకు రుణపడి ఉంటా. నాకు నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మా టీం అందరి గురించి మాట్లాడాలి అనుకున్నా. కానీ, టెన్షన్ వల్ల, వాళ్లందరికీ ఒకేసారి థ్యాంక్స్ చెబుతున్నాను. నాకు చాల బాగా సపోర్ట్ చేశారు. అలాగే ప్రేక్షకులకు కూడా చాలా థ్యాంక్స్” అని అన్నాడు.

ఎంజాయ్ చేశారనుకుంటా

“ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్లకు, ఆడియన్స్‌కి అందరికీ మనస్ఫూర్తిగా వెల్‌కమ్ అండి. నేను ముందుగా డైరెక్టర్ మనోజ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ఈ పాత్రకు తీసుకున్నందుకు. ఆయ‌న నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నా. ఈ మూవీ‌లో కామెడీని మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా” అని నటుడు శ్రీనివాస్ తెలిపాడు.

“కామెడీ అంతలా బాగా రావడానికి కారణం నాతో కలిసి వర్క్ చేసిన ఫణి. ఇద్దరం పోటీ పడి మరీ నటించాం. థ్యాంక్స్ ఫణి. అలాగే హీరో కార్తీక్ గారికి కూడా థ్యాంక్స్. ఆయ‌న నాకు చాలా స్పేస్ ఇచ్చారు. నాది ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు” అని యాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నాడు.

సినిమాకు తీసుకెళ్లాలని

“అలాగే మిగిలిన నటీనటులకు, టెక్నిషియన్స్‌కి, ప్రొడ్యూసర్ అశోక్ గారికి అందరికి చాలా థ్యాంక్స్ అలాగే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్‌కి కూడా థ్యాంక్స్. అలాగే ఇప్పటివరకు సినిమా చూసి నచ్చిన వాళ్లను మీ ఫ్రెండ్స్‌ని, ఫామిలీ మెంబర్స్‌ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను” అని శ్రీనివాస్ కోరారు.

ఫణి మాట్లాడుతూ.. “ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా డైరెక్టర్ మనోజ్ గారికి చాల థ్యాంక్స్. చిన్న సినిమా అయినా ఎక్కడ బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయకుండా సినిమా నిర్మించారు. మా నిర్మాత అశోక్ గారు, అంతేకాకుండా ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్‌కి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గారికి అందరికి చాలా థ్యాంక్స్” అని అన్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024