The Raja Saab Prabhas Look: రాజా సాబ్ నుంచి ప్రభాస్ కొత్త లుక్ అదుర్స్.. పుట్టిన రోజున మరో సర్‌ప్రైజ్ కూడా..

Best Web Hosting Provider In India 2024

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో భారీ బ్లాక్‍బస్టర్ సాధించారు. గతేడాది సలార్‌తో సూపర్ హిట్ సాధించిన ఈ స్టార్ హీరో.. కల్కితో మరింత పెద్ద విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఒకప్పటి వింటేజ్ డార్లింగ్ లుక్‍లో ప్రభాస్ కనిపించనున్నారు. ప్రభాస్ మరో రెండు రోజుల్లో అక్టోబర్ 23న పుట్టిన రోజు జరుపుకోనుండగా.. నేడు (అక్టోబర్ 21) ది రాజా సాబ్ నుంచి ఓ కొత్త లుక్ వచ్చేసింది.

కూల్‍గా నయా లుక్

ది రాజా సాబ్ నుంచి వచ్చిన ప్రభాస్ కొత్త లుక్ చాలా కూల్‍గా, స్టైలిష్‍గా ఉంది. టీ షర్ట్‌పై బ్లూ, ఎల్లో కలర్లతో ఉన్న చెక్స్ జాకెట్, బ్లాక్‍ ప్యాంట్, గ్లాసెస్ ధరించి డార్లింగ్ మరింత హ్యాండ్‍సమ్‍గా ఉన్నారు. సింపుల్ స్టిల్‍తో ఆకట్టుకున్నారు. డామినేట్ చేసే ప్రెసెన్స్‌తో కూల్‍గా ప్రభాస్ ఉన్నారంటూ ఈ స్టిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కింగ్ ఆఫ్ స్వాగ్ అంటూ పేర్కొంది.

పుట్టిన రోజున..

ప్రభాస్ పుట్టిన రోజైన అక్టోబర్ 23వ తేదీన సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. అయితే, ఏ అప్‍డేట్ ఇస్తుందో స్పష్టంగా చెప్పలేదు. 23న వచ్చేస్తున్నాడంటూ పోస్టర్‌పై పేర్కొంది. దీంతో రాజా సాబ్ నుంచి ఆ రోజున ఏం రానుందోననే ఆసక్తి పెరిగిపోయింది.

ది రాజా సాబ్ నుంచి వచ్చిన ప్రభాస్ నయా లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మళ్లీ వింటేజ్ ప్రభాస్‍ను చూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. మిర్చి స్టైల్‍, స్వాగ్‍లా ఈ లుక్ ఉందని, అదిరిపోయిందంటూ సంతోషిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ కొత్త పోస్టర్ వైరల్ అయిపోయింది.

ది రాజా సాబ్ సినిమా నుంచి జూలైలో వచ్చిన ది ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ అదిరిపోయింది. క్లాస్ లుక్‍లో స్టైలిష్‍గా ప్రభాస్ వారెవా అనిపించారు. ఇప్పుడు ఈ కొత్త స్టిల్‍లోనూ కూల్ లుక్‍తో అదరగొట్టారు. ఈ చిత్రంలో ప్రభాస్‍ పాత్ర ఎంటర్‌టైనింగ్‍గా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీని 2025 ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ఇప్పటికే నిర్ణయించింది.

ది రాజా సాబ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. చిత్రీకరణను ఈ ఏడాదిలోనూ పూర్తి చేసేలా డైరెక్టర్ మారుతీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మారుతీ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఇటీవల ఓ మేకింగ్ వీడియో వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో ఈశ్వర్, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. సలార్ సినిమా స్పెషల్ షోలు కూడా ఉండనున్నాయి. రెబల్ స్టార్ బర్త్ డే సెలెబ్రేషన్లకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024