Lifehacks: ఈ 7 వస్తువులను ఎప్పుడూ కొనకండి, చాలా డబ్బు ఆదా చేసినట్లే

Best Web Hosting Provider In India 2024


డబ్బు వృథా కాకుండా ఉండాలంటే కొన్ని రకాల వస్తువుల్ని కొనడం మానేయాలి. అవి మనకు అంతగా ఉపయోగపడవు కూడా. అవేంటో తెల్సుకుంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. మనకు చూడ్డానికి అవి పనికొస్తాయనిపించి విచ్చలవిడిగా కొనేస్తాం. అలా ఎప్పుడూ కొనకూడని వస్తువులేంటో చూసేయండి..

1. బాటిల్ వాటర్:

బయటికి వెళ్లినప్పుడు బాటిల్ వాటర్ కొనుక్కోవడం అలవాటుగా మారిపోతుంది. దానివల్ల మనకు తెలీకుండానే చాలా ఖర్చు పెట్టేస్తాం. బదులుగా ఇంటినుంచి వెళ్లేటప్పుడే వెంట నీళ్లు నింపి తీసుకెళ్లే అలవాటు చేసుకుంటే ప్రతిసారీ డబ్బు ఆదా అవుతుంది.

2. పుస్తకాలు, మేగజైన్లు:

కొత్త పుస్తకాల కన్నా పాత పుస్తకాలు, మేగజైన్లు కొనుక్కోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఇప్పుడు దాదాపు చాలా పుస్తకాల ఆన్‌లైన్ వర్షన్లు ఉచితంగా అందుబాటులో ఉంటున్నాయి. కొన్ని పుస్తకాలను అద్దెకు కూడా తీసుకుని మళ్లీ వాపసు చేసుకునే వీలున్న వెబ్‌సైట్లు కూడా ఉంటాయి.

3. ఖరీదైన డ్రెస్సులు, చీరలు:

ఈరోజుల్లో ఒక్కసారి వేసుకున్న డ్రెస్సు, కట్టుకున్న చీర మరోసారి వేసుకోవాలంటే ఆలోచిస్తున్నారు. ప్రతి సందర్భానికి ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి ఖరీదైన బట్టలకు బదులు, తక్కువ డబ్బుల్లో ఎక్కువ డ్రెస్సులు వచ్చేలా చూసుకుంటే మేలు. పెళ్లికి కూడా తక్కువ రేటు బట్టలు కొనుక్కోడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.

4. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు:

అనవసరమైన ఓటీటీ సైట్ల సబ్‌స్క్రిప్షన్లు ఒకేసారి తీసి పెట్టుకుని వాటిని వాడకుండా ఉంటాం. చాలా సినిమాలు, పాటలు ఆన్‌లైన్ లో ఉచితంగానే ఉంటున్నాయి. మరీ ముఖ్యమైతే మీకు అవసరమనుకున్న ఒకట్రెండు ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ల కన్నా ఎక్కువ తీసుకోకండి

5. ఇంటి సామాన్లు:

డిటర్జెంట్లు, సబ్బులు, డిష్‌వాష్‌లు ఖరీదైనవి, పెద్ద బ్రాండ్లవే కొనక్కర్లేదు. తక్కువ ధరలో మంచి నాణ్యత ఉన్నవి తీసుకోవచ్చు.అలాగే పేపర్ టవెల్స్ ,వెట్ వైప్స్ బదులుగా కాటన్ న్యాప్‌కిన్లు వాడితే ఒక్కసారి కొంటే చాలా రోజులు వాడుకోవచ్చు.

6. సబ్‌స్క్రిప్షన్లు:

సంవత్సరానికి ఒకేసారి సబ్‌స్క్రిప్షన్ తీసుకునే అవకాశం ఇప్పుడు కొన్ని మేకప్ సామాన్లకు, నగలకు, మేగజైన్లకు ఉంటోంది. వాటి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం కన్నా నెలనెలా మనకు అవసరమైతేనే వాటిని కొనుక్కోవడం మేలు. ప్రతినెలా వాటి అవసరం ఉండకపోవచ్చు. వాటికోసం అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నట్లే.

7. బొమ్మలు:

పిల్లలకు ఏవేవో కొనేయాలనే తాపత్రయం, ఇష్టం ఉంటుంది. అలాగని చిన్న పిల్లలకు పెద్ద పెద్ద కార్లు, బొమ్మలు, ఖరీదైన గ్యాడ్జెట్లు కొని డబ్బు వృథా చేయకండి. బదులుగా వాళ్ల జ్ఞాపకశక్తిని, ఆలోచనా శక్తిని పెంచే బొమ్మలు చూడండి. వీటికోసం పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. ఉపయోగకరం కూడా.

 

Whats_app_banner

Source / Credits

Best Web Hosting Provider In India 2024