Telangana Police : ఫొటోలు, వీడియోలు తీయండి.. బహుమతులు గెలుచుకోండి.. తెలంగాణ పోలీసుల ఆఫర్!

Best Web Hosting Provider In India 2024

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా.. ఆ శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. పోలీసు త్యాగాలు, విధుల్లో ప్రతిభను తెలిపేలా ఇటీవల కాలంలో తీసిన మూడు ఫొటోలు, మూడు నిమిషాల లోపు వ్యవధి ఉన్న షార్ట్ వీడియోలను రూపొందించి.. రాష్ట్ర స్ధాయి పోటీలకు పంపొచ్చని పోలీస్ అధికారులు సూచించారు. వీటిని పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచి, ఫొటోలు 10/8 పరిమాణంలో సిద్ధం చేయాలని సూచించారు.

అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, మూఢ నమ్మకాలు, సామాజిక రుగ్మతలు, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ, సైబర్‌ నేరాలు, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, మత్తు పదార్థాల వినియోగం తదితర అనర్థాలపై గత సంత్సరం అక్టోబరు నుంచి.. ఈ సంవత్సరం అక్టోబరు వరకు తీసిన ఫొటోలు, షార్ట్ ఫిలిమ్స్‌ను పోటీలకు పంపించేందుకు అవకాశముంటుందని పోలీసులు వివరించారు.

జిల్లా స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వాటిని.. రాష్ట్ర స్ధాయికి పంపించనున్నారు. అక్కడ గెలుపొందిన వారికి నగదు పురస్కారం లభిస్తుందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌ వేదికగా వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్ధులకు ‘మొబైల్‌ వినియోగం’, డిగ్రీ విద్యార్ధులకు.. ‘తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర’.. అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.

తెలుగు, ఇంగ్లీష్‌లో రాసేందుకు అవకాశం ఇచ్చారు. విద్యార్ధులు రాసిన వ్యాసాలను sp-mulugu@police.gov.in మెయిల్‌కు అక్టోబరు 26 లోపు మెయిల్‌ చేయాలని సూచించారు. ఉత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నారు. అత్యుత్తమంగా ఉన్న వాటిని రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపిక చేస్తామని పోలీసు చెబుతున్నారు.

‘టెర్రరిస్టులు, మావోయిస్టులు, సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడే క్రమంలో.. అమరులైన వారి త్యాగాలను స్మరిస్తూ ఏటా వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా పలు రకాల పోటీలు నిర్వహిస్తుంటాం. జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ప్రతిభ చాటిన వారికి బహుమతులు, ప్రోత్సాహకాలు అందజేస్తాం. పోటీల్లో పాల్గొనే వారు తీసిన ఫొటోలు, షార్ట్ ఫిలిమ్స్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో, ఆయా సమీప పోలీస్ స్టేషన్లలో అందజేయాలి’ అని ఎస్పీ ములుగు శబరీష్ సూచించారు.

Whats_app_banner

టాపిక్

Mulug Assembly ConstituencyTs PolicePolice DepartmentTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024