Bigg Boss Telugu 8 Nominations: నువ్ చూసిన విధానం తప్పు.. నీకు మ్యాటర్ ఏముండదు.. పృథ్వీతో రోహిణి నామినేషన్ ఫైట్ (వీడియో)

Best Web Hosting Provider In India 2024

Bigg Boss 8 Telugu Nominations This Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఎనిమిదో వారానికి వచ్చేసింది. బిగ్ బాస్ 8 తెలుగు ఏడో వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడాడు. ఇక ఎనిమిదో వారం మరొకరు ఎలిమినేట్ అయ్యేందుకు సోమవారం (అక్టోబర్ 21) నామినేషన్స్ ప్రక్రియ మొదలుకానుంది.

బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్

బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో నామినేట్ చేయాలనుకునేవాళ్ల పేర్లు చెప్పి వారి ఎదుట ఉన్న దిష్టి బొమ్మపై కుండను పెట్టి బద్దలు కొట్టాలి. నిఖిల్‌ను విష్ణుప్రియ నామినేట్ చేసింది. “మణికంఠ విషయంలో నువ్ మెహబూబ్‌కు పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సి. కానీ ఇచ్చేశావ్” అని ఏదో గట్టిగా చెప్పేందుకు ప్రయత్నించింది విష్ణుప్రియ.

“మరి నువ్ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేశావ్. దానికి పాయింట్ పోయింది కదా” అని నిఖిల్ అన్నాడు. “హా నేను ఒక్క పాయింటే కదా ఇచ్చింది. మళ్లీ ఇంకేం పాయింట్ ఇవ్వలేదు” అని విష్ణుప్రియ చెప్పింది. “నేను కూడా ఇచ్చింది ఒక్క పాయింటే కదా. ఇంకేం పాయింట్స్ వాడలే” అని నిఖిల్ అన్నాడు. దాంతో సైలెంట్ అయిపోయింది విష్ణుప్రియ.

నేనెందుకు ఫాలో అవ్వాలి

“చెప్పిన రూల్స్ నువ్ ఏమాత్రం వినవు. చాలా సెల్ఫిష్‌గా ఆలోచిస్తావని అనిపిస్తోంది నాకు” అని పృథ్వీని నామినేట్ చేసింది రోహిణి. “నా అపోజిట్‌లో ఉన్న మీ రూల్స్, రెగ్యులేషన్స్ నేనెందుకు ఫాలో అవ్వాలి” అని పృథ్వీ చెప్పాడు. “ఇచ్చిన కేబుల్‌ను మడతపెట్టి జేబులో పెట్టుకుంటే గేమ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది” అని రోహిణి అంది.

“నేను స్ట్రాటజీ ఫాలో అవుతా” అని పృథ్వీ అంటే.. “నువ్ గేమే ఆడకుండా స్ట్రాటజీ అంటే ఎట్లా” అని రోహిణి పంచ్ ఇచ్చింది. తర్వాత ప్రేరణను విష్ణుప్రియ నామినేట్ చేసింది. “ఫుడ్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. నాకు నాకు ఆ ఫుడ్ టాపిక్ మీద వచ్చింది” అని విష్ణుప్రియ అంటే.. “ఫస్ట్ నువ్ ఆ పెద్ద పెద్ద మాటలు వాడకు. అండ్ ఇక్కడ ఎవ్వరికీ ఎవరు అమ్మా, నాన్నా, చెల్లి, తమ్ముడు అని ఏం లేదు. అందరం సమానంగానే ఉన్నాం” అని అక్కడికే ఆపేసింది ప్రేరణ.

“నువ్వు అయితే విష్ణుప్రియ, టాస్క్‌లు నామినేషన్స్ తప్పితే ఎక్కడ కనపడవు” అని పృథ్వీని రోహిణి అంది. “హౌజ్‌లో.. జోక్స్ వేయాలా.. జోక్స్ వేయాలా” అని పృథ్వీ అన్నాడు. “నన్ను అంటున్నావా. బుర్రపెట్టి ఆడే ఆలోచన లేదు” అని కుండబద్దలు కొట్టింది రోహిణి. తర్వాత రోహిణిని పృథ్వీ రివర్స్ నామినేట్ చేశాడు.

చీఫ్ అయ్యావా?

“ఎఫర్ట్ అండ్ విన్నింగ్ ఈజ్ డిఫరెంట్ అది మీకు అర్థం కావాలి. మీరు ఆటలో నాకు జీరో అనిపిస్తుంది” అని పృథ్వీ అన్నాడు. “ఆటలో ఎఫర్ట్ పెట్టట్లేదు” అని రోహిణి తిరిగి అడిగితే.. “ఎఫర్ట్ పెడుతున్నారు” అని పృథ్వీ చెప్పాడు. “మరి ఇంకెం పెట్టాలి. నువ్ ఒక్కసారి అయినా చీఫ్ అయ్యావా పోని” అని రోహిణి అడిగింది. “లేదు” అని పృథ్వీ అన్నాడు.

“మరి ఎట్లా ఎఫర్ట్‌లు పెట్టి గెలిచేస్తున్నావ్ కదా. నీ దగ్గర ఆడే మ్యాటరు, మాట్లాడే మ్యాటరు ఏముండదు. ఏదో ఒకటి వాదించాలి. నామినేషన్ చేయాలి” అని రోహిణి అంది. “రన్నింగ్ కూడా రావాలి కదా” అని పృథ్వీ అంటే.. “రావాలి, వస్తది” అని రోహిణి అంది. “అంత ఈజీ కాదు అది. రాదు” అని రోహిణి పర్సనాలిటీ భారీగా ఉందన్నట్లుగా పై నుంచి కిందకు పృథ్వీ చూసినట్లు అనిపించింది.

“ఏంటది.. ఆ చూపేంటీ.. నువ్ నన్ను చూసిన విధానం దట్ ఈజ్ నాట్ రైట్” అని రోహిణి గట్టిగా అరిచింది. తర్వాత రోహిణి దిష్టిబొమ్మపై కుండ పెట్టి బద్దలు కొట్టాడు పృథ్వీ. ఇలా రోహిణి వర్సెస్ పృథ్వీ ఫైట్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024