Karwa Chauth for Mia Khalifa : మియా ఖలీఫా కోసం కర్వా చౌత్​ పూజలు- తాతా.. ఇదేం పని?

Best Web Hosting Provider In India 2024


భారతదేశంలో వివాహిత మహిళలకు ముఖ్యమైన పండుగల్లో ఒకటి కర్వా చౌత్. సాంప్రదాయకంగా వారి భర్తల దీర్ఘ, ఆరోగ్యకరమైన జీవితాల కోసం భార్యలు ఉపవాసం చేస్తారు. అయితే కర్వా చౌత్​ పేరుతో ఓ వృద్ధుడు తాజాగా చేసిన పని చూసి అందరు షాక్​ అవుతున్నారు! మాజీ అడల్ట్ ఫిల్మ్ స్టార్ మియా ఖలీఫా కోసం కర్వా చౌత్ పూజ చేస్తున్న ఆ వృద్ధుడి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.​ దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విపరీతంగా చర్చ జరుగుతోంది. 

మియా ఖలీఫా కోసం కర్వా చౌత్​ పూజలు..

ఎక్స్​లో హాస్యభరితమైన కంటెంట్​కి ప్రసిద్ధి చెందిన గురు జీ అనే యూజర్ షేర్ చేసిన ఈ క్లిప్ పలువురి దృష్టిని ఆకర్షించింది.

ఈ వీడియోలో సంప్రదాయ థాలీ, చన్నీతో పూజలో నిమగ్నమైన వృద్ధుడు గోడకు అతికించిన మియా ఖలీఫా ఫొటోని చూస్తున్నాడు. మియా ఖలీఫా ఆరోగ్యంగా ఉండాలని కర్వా చౌత్​ పూజలు చేశాడు.

ఈ వీడియోని కొందరు ఫన్నీగా చూడగా.. మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్​ కోసం, అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి పనులు చేయడం కరెక్ట్​ కాదని అసమ్మతి వ్యక్తం చేశారు.

సోషల్​ మీడియాలో వైరల్​ అయిన ఆ క్లిప్ ఇక్కడ చూడండి:

ఈ వీడియోపై వస్తున్న కామెంట్లను చూసేయండి..

“కేవలం అటెన్షన్​, వ్యూస్​ కోసం ఇంతటి అందమైన కర్వా చౌత్​ వేడుకను వాడుకోవడం బాధాకరం” అని ఒకరు కామెంట్​ చేశారు.

“ఇదంతా ఆ వృద్ధుడి మనవళ్లు, మనవరాళ్ల ప్లాన్​ అయ్యుండొచ్చు. వ్యూస్​, లైక్స్​ కోసం ఇలా చేసి ఉండొచ్చు,” అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. ‘క్రీపీ విషయం,’ అని ఇంకొకరు అన్నారు.

అయితే చాలా మంది ఈ విషయాన్ని లైట్​గా తీసుకున్నారు. ‘చాలా ఫన్నీగా ఉంది’, అని ఒకరు అంటే.. ‘దీన్ని చూసి నేను గట్టిగా నవ్వేశాను,’ అని ఇంకొకరు అన్నారు. 

మియా ఖలీఫాకు సంబంధించిన గత సంఘటనలు

భారతదేశంలో మియా ఖలీఫా ఫొటో వివాదానికి దారి తీయడం ఇది మొదటిసారి కాదు. ఆగస్టులో తమిళనాడులోని కాంచీపురంలో అమ్మన్ (పార్వతి) అమ్మవారిని పూజించే ఆడి పండుగ అలంకరణలో భాగంగా మియా ఖలీఫా పోలికలతో కూడిన హోర్డింగ్ కనిపించింది.

ఆ పోస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఖలీఫాతో పాటు స్థానిక దేవతల చిత్రాలతో కూడిన ఈ హోర్డింగ్ చూపరులను షాక్​కు గురి చేసింది. ఈ వ్యవహారం వైరల్ కావడంతో పోలీసులు దానిని తొలగించారు.

మరి మియా ఖలీఫాకు కర్వా చౌత్​ పూజలు చేయడంపై మీ ఒపీనియన్​ ఏంటి?

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link