Akki Roti: కర్ణాటక స్పెషల్ అక్కిరోటీ, బియ్యంపిండితో చేసే టేస్టీ అల్పాహారం

Best Web Hosting Provider In India 2024

బ్రేక్ ఫాస్ట్ కోసం కొత్తగా, టేస్టీగా ఏదైనా చేయాలనుకుంటే అక్కీ రోటీ చేసుకోవచ్చు. ఇది కర్ణాటకలో సాంప్రదాయ, ప్రసిద్ధ వంటకం. దీనిని బియ్యం పిండితో తయారు చేస్తారు. ఈ రోటీని సాధారణంగా స్పైసీ రెడ్ చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తారు. ఇందులో కూరగాయలను కూడా ఉపయోగిస్తారు, కాబట్టి ఇది చాలా పోషకమైనదిగా కూడా పరిగణించబడుతుంది. బ్రేక్ ఫాస్ట్ కోసం అక్కి రోటీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

అక్కీ రోటీ తయారీకి కావాల్సినవి:

4 కప్పుల బియ్యం పిండి

2 ఉల్లిపాయలు, సన్నగా తరిగినవి

4 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర

4 టేబుల్ స్పూన్ల తరిగిన కరివేపాకు

2 అంగుళాల తురిమిన అల్లం

4 సన్నగా తరిగిన మిరపకాయలు

2 టీస్పూన్లు జీలకర్ర

ఉప్పు రుచికి తగినంత

నెయ్యి కొద్దిగా

అక్కీ రోటీ తయారీ విధానం:

  1. అక్కి రోటీ తయారు చేయడానికి, ముందుగా ఒక పెద్ద గిన్నెలో 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని తరువాత ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు తరుగు వేసుకోవాలి.
  2. ఇప్పుడు అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు కూడా వేసి కలపాలి. ఇప్పుడు అవసరమైనంత నీరు పోసి పిండి కలపడం ప్రారంభించాలి.
  3. అక్కి రొట్టె పిండిని తయారు చేసిన తర్వాత కనీసం పావుగంట అయినా పక్కన పెట్టుకోవాలి.
  4. తరువాత ఒక పెనం పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని గరిటెడు పోసుకోండి.
  5. మరీ దోశలాగా పలుచగా కాకుండా కాస్త మందంగానే ఉంచండి. ఒక్కసారి అలా చెంచాతో పైపైన అంటే చాలు.
  6. ఇప్పుడు చుట్టూ నెయ్యి వేసుకుని కాల్చుకుని మరో వైపు తిప్పి కాల్చుకోవడమే. రోటీ రెడీ అయినట్లే. ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024