OTT Korean Horror Movie: ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మరో కొరియన్ హారర్ మూవీ.. టీచర్లే జాంబీలైతే..

Best Web Hosting Provider In India 2024

OTT Korean Horror Movie: ఓటీటీల్లో కొరియన్ డ్రామాలకు క్రేజ్ పెరిగిన నేపథ్యంలో అక్కడ ఎప్పుడో ఏళ్ల కిందట రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్ కూడా ఇప్పుడు ఇండియన్ ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి. అలా మరొక కొరియన్ హారర్ మూవీ కూడా తెలుగులో ఈవారం ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా పేరు జాంబీ స్కూల్. ఇదో డిఫరెంట్ స్టోరీతో వచ్చిన హారర్ మూవీ.

జాంబీ స్కూల్ ఓటీటీ రిలీజ్ డేట్

కొరియన్ కంటెంట్ ను భారతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళంలాంటి వాటిలోకి తీసుకొచ్చే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్లేఫ్లిక్స్ (Playflix). తాజాగా ఈ జాంబీ స్కూల్ హారర్ మూవీ కూడా ఇదే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఈ సినిమా వచ్చే శుక్రవారం (అక్టోబర్ 25) నుంచి ప్లేఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 2014లో కొరియాలో రిలీజైన ఈ సినిమా పదేళ్ల తర్వాత ఓటీటీ ద్వారా ఇక్కడి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.

జాంబీ స్కూల్.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో..

జాంబీ స్కూల్ మూవీ హారర్ జానర్లో వచ్చిన ఓ డిఫరెంట్ కంటెంట్ కలిగిన మూవీ. కిమ్ సియుంగ్-హ్వాన్, హా యున్-సియోల్, చా మిన్-జీ లాంటి వాళ్లు నటించారు. సౌత్ కొరియాలోని చిల్సుంగ్ అనే స్కూల్లో టీచర్లే జాంబీలుగా మారిపోయిన కథతో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ స్కూల్లోని స్టూడెంట్స్ అందరూ అసలు క్రమశిక్షణ లేకుండా, చాలా దారుణంగా ప్రవర్తిస్తారన్న పేరుంది. అయితే వాళ్లను కంట్రోల్ చేయడానికి టీచర్లకు ఏం చేయాలో అర్థం కాదు. సడెన్ గా ఒకరోజు అక్కడి టీచర్లందరూ జాంబీలుగా మారిపోతారు. వాళ్లు స్కూల్లో అటూఇటూ తిరుగుతూ స్టూడెంట్స్ ను చంపడానికి ప్రయత్నిస్తుంటారు.

అయితే వాళ్లకు భయపడి పారిపోకుండా కలిసికట్టుగా ఆ జాంబీల రూపంలో ఉన్న తమ టీచర్లను ఎదుర్కోవాలని స్టూడెంట్స్ నిర్ణయించుకుంటారు. ఒకవేళ ఈ ప్రయత్నంలో వాళ్లు విఫలమైతే తమతోపాటు మొత్తం నగరమంతా ప్రమాదంలో పడుతుందని వాళ్లకు తెలుసు. అందుకే ఎంతో ధైర్యంగా వాళ్లకు ఎదురు నిలిచి పోరాడుతూ ఉంటారు. మరి ఆ ప్రయత్నంలో వాళ్లు సక్సెస్ అయ్యారా? జాంబీలుగా మారిపోయిన ఆ టీచర్ల పరిస్థితి ఏంటి అన్నది మూవీలో చూడాలి.

ప్లేఫ్లిక్స్ కొరియన్ కంటెంట్

జాంబీ స్కూల్ మూవీ అక్టోబర్ 25న ప్లేఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతోంది. అయితే ఇప్పటికే చాలా కొరియన్ కంటెంట్ ఈ ఓటీటీలో అందుబాటులో ఉంది. స్వీట్ అండ్ సాల్టీ ఆఫీస్, లోన్లీ ఎనఫ్ టు లవ్, రిచ్ మ్యాన్, 1 పర్సెంట్ సమ్‌థింగ్, చిల్డ్రన్ ఆఫ్ నోబడీ, యు ఆర్ మై డెస్టినీ, లెస్ దాన్ ఈవిల్ లాంటి సినిమాలు ఈ ఓటీటీలో తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024