Hyderabad : హైదరాబాద్‌లో విషాదం.. కుక్కను ఆటపట్టిస్తూ.. మూడో అంతస్తు నుంచి పడిపోయి యువకుడు మృతి.. వీడియో

Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్ చందానగర్‌లోని వివి ప్రైడ్‌ హోటల్‌లో విషాదం జరిగింది. ఉదయ్‌ కుమార్‌ అనే 24 ఏళ్ల యువకుడు హోటల్‌ మూడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందాడు. ఉదయ్ అనే పాలిటెక్నిక్ విద్యార్థి స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది.

ఉదయ్ తన స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా.. ఫ్రెండ్స్‌తో కలిసి మొదట అశోక్ నగర్, జ్యోతి నగర్‌లో కేక్ కట్ చేశాడు. కేక్‌ కటింగ్‌ అనంతరం వేడుకలు జరుపుకునేందుకు వీవీ ప్రైడ్‌ హోటల్‌కు వెళ్లారు. మూడో అంతస్తులో బర్త్ డే పార్టీ జరుగుతోంది.

పార్టీ జరుగుతుండగా ఉదయ్ బాల్కనీలోకి వచ్చాడు. ఈ సమయంలో ఓ కుక్క అతడికి కనపడింది. దాన్ని ఆటపట్టించే క్రమంలో.. ఉదయ్ అదుపు తప్పి మూడో అంతస్థులోని కిటికీలోంచి కిందపడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటన మొత్తం హోటల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

డెలివరీ బాయ్‌పై ఎటాక్..

ఇటీవల కూడా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. మణికొండలో పంచవటి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశారు. డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన డెలివరీ బాయ్‌ తలుపు తట్టాడు. తలుపు తీయగానే యజమాని కంటే ముందే పెంపుడు కుక్క బయటికి వచ్చింది. డెలివరీ బాయ్‌పై దాడి చేసింది.

భయపడిన డెలివరీ బాయ్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆ కుక్క ముందుకు దూసుకురావటంతో.. ప్రాణాలు కాపాడుకోవాలన్న తొందరలో తాను ఉన్నది మూడో అంతస్తు అని మర్చిపోయి.. కిందికి దూకేశాడు. అతనికి తీవ్ర గాయాలు అవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.

Whats_app_banner

టాపిక్

HyderabadCrime NewsTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024