Ayudha Pooja Full Video Song: ఎన్టీఆర్ డ్యాన్స్ దుమ్మురేపిన దేవర ‘ఆయుధ పూజ’ పాట ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది: చూసేయండి

Best Web Hosting Provider In India 2024

దేవర చిత్రంలో ‘ఆయుధ పూజ’ పాట ఓ రేంజ్‍లో హిట్ అయింది. ఈ చిత్రానికి ఈ సాంగ్ చాలా ప్లస్ అయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఆ పాటలో డ్యాన్స్ దుమ్మురేపారు. మాస్ స్టెప్‍లతో హోరెత్తించారు. దేవర బ్లాక్‍బస్టర్ అయ్యేందుకు ఈ సాంగ్ కూడా తోడ్పడింది. అంతలా ఆకట్టుకున్న ‘ఆయుధ పూజ’ ఫుల్ వీడియో ఎప్పుడు వస్తుందా అని చాలా మంది నిరీక్షిస్తున్నారు. అయితే, ఎట్టకేలకు ఫుల్ వీడియో సాంగ్ నేడు (అక్టోబర్ 22) వచ్చేసింది.

దేవరలో మోస్ట్ సెలెబ్రేటెడ్ ఆయుధ పూజ వీడియో సాంగ్ తీసుకొచ్చామంటూ మూవీ టీమ్ నేడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియో సాంగ్‍ను షేర్ చేసింది.

సోషల్ మీడియాలో మోత

దేవర నుంచి ఆయుధ పూజ పూర్తి వీడియో సాంగ్ వచ్చిన కాసేపటికే సోషల్ మీడియాలో మోత మోగిపోతోంది. ఈ పాట వీడియో క్లిప్‍లను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మాస్ స్టెప్‍లను మరోసారి ప్రశంసిస్తున్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొట్టారని, ఆయనను ఎవరూ మ్యాచ్ చేయలేరంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఆయుధ పూజ పాట సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది.

దేవర చిత్రంలో జాతర సమయంలో వచ్చే ‘ఆయుధ పూజ’ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ముందు నుంచి ఈ పాటకు హైప్ ఇస్తూ వస్తోంది మూవీ టీమ్. అందుకు తగ్గట్టే ఈ పాట మెప్పించింది. అనిరుధ్ రవిచందర్ మాస్ బీట్‍కు ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్‍లతో అదరగొట్టారు. దీంతో ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. పూర్తి వీడియో సాంగ్ రావటంతో ఇప్పుడు నెట్టింట్లో మరోసారి ఆయుధ పూజ సాంగ్ ఫీవర్ పెరిగిపోయింది.

దేవర కలెక్షన్లు

దేవర చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.520కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ మూవీకి ఇంకా కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ దేవర బాగా వసూళ్లను రాబట్టింది. తమిళం, మలయాళం, కన్నడలోనూ అంచనాల తగ్గట్లే కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇంకా కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.

దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేశారు. బాలీవుడ్ స్టార్లు జాన్వీ, సైఫ్ ఈ చిత్రంతోనే తెలుగులో అడుగుపెట్టారు. శ్రీకాంత్, కలైయారాసన్, శృతి మరాఠే, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో ఈ చిత్రంలో కీరోల్స్ చేశారు.

దేవర మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ నిర్మించగా.. కల్యాణ్ రామ్ సమర్పించారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకొని సూపర్ హిట్ అయింది. ఈ మూవీకి రెండో పార్ట్ కూడా ఉండనుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024