Arthamainda Arun Kumar S2 OTT: సరదాగా, ట్విస్టులతో అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024


‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయింది. గతేడాది ఆహా ఓటీటీలో ఈ కామెడీ సిరీస్ హిట్ అయింది. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్ దాటి అదరగొట్టింది. ఈ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. ‘అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2’ సిద్ధమైంది. ఈ సిరీస్‍లో కార్పొరేట్ ప్రపంచంలో సవాళ్లు ఎదుర్కొనే అరుణ్ కుమార్‌గా ప్రధాన పాత్ర పోషించారు సిద్ధు పవన్ నటించారు. తొలి సీజన్‍లో హర్షిత్ రెడ్డి ఆ క్యారెక్టర్ చేయగా.. ఈ సీజన్‍లో సిద్ధు ఆ ప్లేస్‍లో వచ్చారు. తేజస్వి మదివాడ, అనన్య శర్మ కూడా లీడ్ రోల్స్ చేశారు. అర్థమైందా అరుణ్ కుమార్ రెండో సీజన్ ట్రైలర్ నేడు (అక్టోబర్ 22) రిలీజ్ అయింది.

అవే కష్టాలు

తొలి సీజన్‍కు కొనసాగింపుగానే ఈ రెండో సీజన్ వస్తోంది. ఐటీ ఆఫీస్‍లో షాలినీ (తేజస్వి మదివాడ) టీమ్‍లోనే అరుణ్ కుమార్ (పవన్ సిద్ధు) కంటిన్యూ అవుతాడు. అతడి కార్పొరేట్ కష్టాలు కొనసాగుతూ ఉంటాయి. ఇంటర్న్ నుంచి అరుణ్ కుమార్ ఎంప్లాయ్ అవుతాడనేలా ట్రైలర్లో ఉంది. షాలినీ మళ్లీ రిలేషన్ కోసం అరుణ్‍కు హింట్స్ ఇస్తుంది.

ట్విస్ట్ ఇదే

షాలినీ వల్ల అరుణ్ కుమార్‌కు పల్లవి (అనన్య శర్మ) తొలి సీజన్లో దూరమవుతుంది. ప్రేమ ఆరంభంలోనే బ్రేకప్ అవుతుంది. అయితే, ఈ రెండో సీజన్‍లో పల్లవి.. క్లయింట్‍గా మళ్లీ అరుణ్ వద్దకు రావటంతో ట్విస్ట్ ఎదురవుతుంది. సాయి కిరణ్, సిరి పాత్రలు కూడా ఈ సీజన్‍లో కొత్తగా వచ్చాయి. పల్లవికి దగ్గరయ్యేందుకు అరుణ్ మళ్లీ ప్రయత్నిస్తాడు. పల్లవి దూరంగా వెళ్లానుకుంటుంటుంది. ఉద్యోగంలోనూ అరుణ్‍కు సవాళ్లు ఎదురవుతుంటాయి. పల్లవి, షాలినీతో అరుణ్ కుమార్ రిలేషన్ ఏమైంది.. ఉద్యోగంలో సవాళ్లను అధిగమిస్తాడా అనే అంశాల చుట్టూ ఈ రెండో సీజన్ సాగనుంది.

అర్థమైందా అరుణ్ కుమార్ రెండో సీజన్ ట్రైలర్ సరాదాగా సాగుతూనే.. మధ్యలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. ఎమోషనల్ సీన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గానే సాగింది.

అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ రెండో సీజన్‍కు ఆదిత్య కేవీ దర్శకత్వం వహించారు. సిద్ధు పవన్, తేజస్వి, అనన్యతో పాటు సిరిసి రాశి, శ్రీనివాసులు, అభిషేక్, ఫణిచంద్ర, కార్తిక్, గాయత్రి, రమణి, హరి వర్మ, సాయి కిరణ్ ఈ సీజన్‍లో కీలకపాత్రలు పోషించారు. అజయ్ అరసాద సంగీతం అందించారు. అర్రే స్టూడియోస్, లాఫింక్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్లు ఈ సిరీస్‍ను ప్రొడ్యూడ్ చేశాయి.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

అర్థమైందా అరుణ్ కుమార్ రెండో సీజన్ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అక్టోబర్ 31వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.

ఈ వారమే లిటిల్ హార్ట్స్ సినిమా

లిటిల్ హార్ట్స్ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అక్టోబర్ 24వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. జూన్‍లో మలయాళంలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వెర్షన్‍లో ఆహాలో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ హీరోహీరోయిన్లుగా నటించారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024