Power Grid Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 795 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

Best Web Hosting Provider In India 2024


PGCIL Trainee Recruitment 2024: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు పీజీసీఐఎల్ అధికారిక వెబ్సైట్ powergrid.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 795 డిప్లొమా ట్రైనీ, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది.

ముఖ్యమైన తేదీలు

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 2024 అక్టోబర్ 22 వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 నవంబర్ 12. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 22, 2024
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2024 నవంబర్ 12
  • రాత పరీక్ష తేదీ: 2025 జనవరి/ఫిబ్రవరిలో. ఖచ్చితమైన తేదీని వెబ్సైట్లో ప్రత్యేకంగా తెలియజేస్తారు.

ఖాళీల వివరాలు

  • సీసీ: 50 పోస్టులు
  • ఈఆర్ 1: 33 పోస్టులు
  • ఈఆర్ 2: 29 పోస్టులు
  • ఒడిశా: 32 పోస్టులు
  • ఎన్ఈఆర్: 47 పోస్టులు
  • ఎన్ఆర్ 1: 84 పోస్టులు
  • ఎన్ఆర్ 2: 72 పోస్టులు
  • ఎన్ఆర్ 3: 77 పోస్టులు
  • ఎస్ఆర్ 1: 71 పోస్టులు
  • ఎస్ఆర్ 2: 112 పోస్టులు
  • డబ్ల్యూఆర్ 1: 75 పోస్టులు
  • డబ్ల్యూఆర్ 2: 113 పోస్టులు

అర్హతలు, ఇతర వివరాలు

పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, వయోపరిమితిని తనిఖీ చేయవచ్చు.

ఎంపిక విధానం

అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), కంప్యూటర్ స్కిల్ టెస్ట్ (CST), ప్రీ ఎంప్లాయిమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. మెరిట్ క్రమంలో, అవసరాన్ని బట్టి తగిన అభ్యర్థులకు నియామక ఆఫర్ జారీ చేస్తారు.

దరఖాస్తు ఫీజు

  • డీటీఈ/డీటీసీ/జేవోటీ(హెచ్ఆర్)/జేవోటీ(ఎఫ్అండ్ఏ) పోస్టులకు రూ.300/-
  • అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఏ) పోస్టుకు: రూ.200/-

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-ఎస్ఎం అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు పీజీసీఐఎల్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link