NICL Recruitment 2024: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో భారీ రిక్రూట్ మెంట్; డిగ్రీ ఉంటే చాలు..

Best Web Hosting Provider In India 2024


నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఎన్ఐసీఎల్ అధికారిక వెబ్ సైట్ nationalinsurance.nic.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభమై నవంబర్ 11, 2024న ముగుస్తుంది. ముఖ్యమైన తేదీలు, అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలను ఇక్కడ చూడండి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: అక్టోబర్ 24, 2024
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2024 నవంబర్ 11
  • ఫేజ్-1 పరీక్ష: నవంబర్ 30, 2024
  • ఫేజ్-2 పరీక్ష: డిసెంబర్ 28, 2024

అర్హతలు

  • నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) లో అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
  • అభ్యర్థి 01.10.2024 నాటికి అర్హత పరీక్షలో, అంటే డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
  • నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL)లో అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 02.10.1994 నుంచి 01.10.2003 (రెండు రోజులు కలిపి) మధ్య జన్మించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • అభ్యర్థులందరూ ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత, మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులను ప్రాంతీయ భాషా పరీక్షకు షార్ట్లిస్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్ లైన్లో నిర్వహిస్తారు. దీని వ్యవధి 60 నిమిషాలు.
  • రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ కు అర్హత సాధించడానికి లోబడి ఆన్ లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ లో అభ్యర్థులు సాధించిన మార్కులను అనుసరించి రాష్ట్రాల వారీగా, కేటగిరీల వారీగా తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు.

దరఖాస్తు ఫీజు

ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎక్స్ఎస్ కేటగిరీ అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ ఛార్జీలుగా రూ.100, ఇతర అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ ఛార్జీలతో కలిపి అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాలి. డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించవచ్చు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link