Action Thriller Movie: తెలుగులో టీవీలోకి వస్తున్న ధనుష్ బ్లాక్‍బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. టెలికాస్ట్ ఎప్పుడంటే..

Best Web Hosting Provider In India 2024

కోలీవుడ్ స్టార్ ధనుష్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన రాయన్ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ జూలై 26వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ మంచి కలెక్షన్లు దక్కించుకుంది. ఓటీటీలోనూ రాయన్ చిత్రానికి భారీ వ్యూస్ దక్కాయి. ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ టీవీలో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది.

టెలికాస్ట్ వివరాలు

రాయన్ సినిమా తెలుగు వెర్షన్ జెమినీ టీవీలో అక్టోబర్ 31వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ టెలికాస్ట్ కానుంది. ఈ విషయాన్ని జెమినీ ఛానెల్ అధికారికంగా వెల్లడించింది. కొన్ని రోజులుగా త్వరలో అంటూ ఊరిస్తూ చ్చిన ఆ ఛానెల్ అక్టోబర్ 31 సాయంత్రం 6 గంటలకు రాయన్ టెలికాస్ట్ చేయనున్నట్టు ఇప్పుడు ప్రకటించింది.

రాయన్ మూవీని పక్కా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ధనుష్ రూపొందించారు. ఈ చిత్రంలో ధనుష్‍తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్, కాళిదాసు జయరాం, ఎస్‍జే సూర్య ప్రధాన పాత్రలు పోషించారు. సెల్వరాఘవన్, అపర్ణా బాలమురళి, ప్రకాశ్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్, దిలీపన్ కీలకపాత్రలు పోషించారు.

రాయన్ మూవీలో ధనుష్ నటనతో పాటు దర్శకుడిగా టేకింగ్ కూడా అదరగొట్టారు. ఎక్కువ వైలెన్స్‌తో రస్టిక్‍గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నటుడిగా ధనుష్‍కు ఇది 50వ చిత్రం కావడం మరో విశేషం. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.

రాయన్ కలెక్షన్లు

రాయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం సుమారు రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టగలిగింది.

ఓటీటీలోనూ సక్సెస్

రాయన్ సినిమా ఆగస్టు 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం, కన్నడలోనూ అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో రాయన్ మూవీకి భారీ వ్యూస్ దక్కాయి. ఈ చిత్రం కొన్ని వారాల పాటు ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచింది. ఓటీటీలో సూపర్ సక్సెస్ అయింది.

ధనుష్ లైనప్

కాగా, ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కూడా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు పోస్టర్స్, గ్లింప్స్ చాలా ఆసక్తిని రేకెత్తించాయి. కుబేర మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. త్వరలోనే డేట్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఇడ్లీ కడాయ్ అనే మూవీకి దర్శకత్వం వహించనున్నారు ధనుష్. బాలీవుడ్‍లో తేరే ఇష్క్ మే చిత్రంలో హీరోగా నటించనున్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024