Best Web Hosting Provider In India 2024
NBK: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25 నుంచి మొదలుకాబోతోంది. నాలుగో సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇందుకు సంబంధించిన ప్రోమోలను ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలు ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి.
పొటిలికల్ జర్నీ….ఫ్యామిలీ లైఫ్…
సుదీర్ఘంగా సాగిన ఈ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో చంద్రబాబు రాజకీయ జీవితంతోపాటు ఫ్యామిలీ లైఫ్ గురించి పలు ప్రశ్నలు బాలయ్య సందించారట. వాటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబును బాలకృష్ణ పలు కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగినట్లు తెలుస్తోంది. వాటన్నింటికి చంద్రబాబు తన సమయస్పూర్తితో సమాధానాలు ఇచ్చినట్లు ప్రోమోల్లో కనిపిస్తోంది. చంద్రబాబు, బాలకృష్ణ ఎపిసోడ్ అన్‌స్టాపబుల్‌లో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు చెబుతోన్నారు.
52 రోజులు జైలులో…
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజుల పాటు జైలులో గడిపారు. ఆ జైలు జీవితంపై చంద్రబాబును బాలకృష్ణ పలు ప్రశ్నలు అడిగినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. జైలు జీవితం చంద్రబాబునాయుడిలో సీమపౌరుషాన్ని నిద్రలేపిందా? వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపైప్రతీకారం తీర్చుకోవాలన్న కసి తీసుకొచ్చిందా?
మాజీ సీఎంకు వ్యతిరేకంగా చంద్రబాబు ఏవైనా ఫైల్స్ సిద్ధం చేస్తున్నారా అనే ప్రశ్నలను అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో చంద్రబాబును బాలకృష్ణ అడిగినట్లు సమాచారం. స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో అసలు ఏం జరిగింది, అతడిపై ఎలా కుట్రలు పన్నారన్నది సీఎం చంద్రబాబునాయుడు ఈ ఎపిసోడ్‌లో చెప్పబోతున్నట్లు సమాచారం.
జైలు గదుల్లో…
52 రోజులు చంద్రబాబునాయుడు జైల్లో ఎలా గడిపారు ? సీఎంగా జైళ్లను ఆధునీకరించిన చంద్రబాబు.. ఓ నిందితుడిగా ఆ గదుల్లోనే గడపాల్సి వచ్చిన టైమ్‌లో ఎలాంటి సంఘర్షణకు లోనయ్యారన్నది అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో బాలకృష్ణతో చంద్రబాబు పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల మధ్య నుంచి చంద్రబాబునాయుడు చూసిన ప్రపంచం ఎలా ఉంది? జైలులో వీఐపీగా గడిపారా? భయంతోనే రోజులు వెళ్లదీశారా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. .జైలు జీవితం నుంచి కొత్తగా అలవర్చుకున్నవిషయాల గురించి చంద్రబాబును బాలకృష్ణ అడిగినట్లు చెబుతోన్నారు.
జనసేనతో పొత్తు…
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎలెక్షన్స్‌లో పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధికారాన్ని చేపట్టింది. జనసేనతో టీడీపీ పొత్తు ప్రకటించడానికి ముందు రాజమండ్రిలోని సెంట్రల్ జైలు నాలుగుగోడల నడుమ పవన్‌కళ్యాణ్, చంద్రబాబునాయుడు మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి? పోత్తు అన్నది ఆలోచించి తీసుకున్న ప్రకటనా? పవన్ ఎమోషన్‌లో తీసుకున్న నిర్ణయమా? అని ప్రశ్నలు కూడా ఈ ఎపిసోడ్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ టాపిక్…
లోకేష్, పవన్‌కల్యాణ్, బాలకృష్ణ…ఈ ముగ్గురిలో చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు? చంద్రబాబును బాలకృష్ణ అడిగినట్లు తెలుస్తోంది. పాలనపరమైన అంశాలతో పాటు కుటుంబవ్యవహరాల్లో భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలకు చంద్రబాబు ఇస్తున్న మార్కులెన్నిఅంటూ బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు చెప్పిన సమాధానం ఏమిటన్నది ఆసక్తిని పంచుతోంది.
ఈ ఎపిసోడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన టాపిక్ వచ్చినట్లు తెలుస్తోంది. జానియర్ ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏం చెప్పారన్నది కూడా ఎపిసోడ్‌లో ఉండనుందట. అమరావతి గురించి కూడా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో ప్రశ్నలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 25 రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఫుల్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.