Prabhas: ఆ క‌టౌట్ చూసి న‌మ్మేయాలి డ్యూడ్ – ప్ర‌భాస్‌కు మెగాస్టార్ బ‌ర్త్‌డే విషెస్ – అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌ వెయిటింగ్

Best Web Hosting Provider In India 2024

Prabhas: రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా మెగాస్టార్ చిరంజీవి విషెస్ చెప్పారు. ఆ క‌టౌట్ చూసి అన్ని న‌మ్మేయాలి డ్యూడ్ అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అత‌ను ప్రేమించే ప‌ద్ద‌తి చూసి…తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బ‌ర్త్‌డే డార్లింగ్ ప్ర‌భాస్ అంటూ చిరంజీవి విషెస్ తెలియ‌జేశారు.

రామ్‌చ‌ర‌ణ్…శ‌ర్వానంద్‌…

చిరంజీవితో పాటు టాలీవుడ్ ప్ర‌ముఖులు ప్ర‌భాస్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన‌రోజు శుభాకంక్ష‌లు అంద‌జేశారు. రామ్‌చ‌ర‌ణ్, శ‌ర్వానంద్‌, శ్రీవిష్ణుతో పాటు ప‌లువురు హీరోలు ప్ర‌భాస్‌కు విషెస్ చెబుతూ అత‌డితో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఫొటోల‌ను పంచుకుంటున్నారు.

క‌ల్కి టీమ్ ప్ర‌భాస్‌కు విషెస్ చెబుతూ సినిమాలోని ఓ సీన్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్న‌ది. మీ ఆన్‌స్క్రీన్ ప‌ర్ఫార్మెన్స్ మాదిరిగానే ఈ పుట్టిన‌రోజు లార్జ‌ర్‌దేన్ లైఫ్‌గా మిగిలిపోవాలంటూ ఆనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.

రాజాసాబ్‌…స్పిరిట్‌…

ప్ర‌భాస్ హ్యాష్‌ట్యాగ్‌తో పాటు అత‌డి నెక్స్ట్ మూవీస్ రాజాసాబ్‌, స్పిరిట్ హ్యాష్‌ట్యాగ్‌లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమాల‌కు సంబంధించి స్పెష‌ల్ అప్‌డేట్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే రాజాసాబ్ టీమ్ ప్ర‌భాస్ స్టైలిష్ పోస్ట‌ర్‌ను బ‌ర్త్‌డే ఒక‌రోజు ముందే రిలీజ్ చేసి అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది. బుధ‌వారం కూడా రాజాసాబ్ నుంచి ఓ స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని అంటున్నారు.

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌…

మ‌రోవైపు స్పిరిట్ టీమ్ నుంచి ఎలాంటి అప్‌డేట్ వ‌స్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సందీప్ వంగాతో మూవీ టీమ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వినిపించే అవ‌కాశం ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంజ‌రుగుతోంది. ఈ అప్‌డేట్ అదిరిపోతుంద‌ని అంటున్నారు. స్పిరిట్ మూవీలో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

స్పెష‌ల్ పోస్ట‌ర్‌…

హ‌నురాఘ‌వ‌పూడి మూవీ నుంచి కూడా స్పెష‌ల్ పోస్ట‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న మూవీ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. న‌వంబ‌ర్ నుంచి ఈ మూవీసెట్స్‌లో ప్ర‌భాస్ అడుగుపెట్ట‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ ఇమాన్వీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

రాజాసాబ్‌, స్పిరిట్‌తో పాటు స‌లార్ 2, క‌ల్కి సీక్వెల్‌ల‌లో ప్ర‌భాస్ న‌టిస్తోన్నారు. క‌ల్కి పార్ట్ 2 షూటింగ్ ఈ ఏడాది చివ‌ర‌లో మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024