Bedsheets in Train: రైళ్లలో ఇచ్చే దుప్పట్లు ఉతికేది నెలకి ఒకసారి లేదా రెండు సార్లే, వాటితో ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు

Best Web Hosting Provider In India 2024

రైళ్లలో ప్రయాణించే వారికి ఈ దుప్పట్ల గోల బాగా పరిచయమే. ఎందుకంటే ఏసీల్లో ప్రయాణం చేసేవారికి రైల్వే వారే కప్పుకోవడానికి దుప్పట్లను ఇస్తారు. ఆ బెడ్ షీట్లను చూస్తే వేడిగా అప్పుడే ఐరన్ చేసి ఇచ్చినట్టుగా ఉంటుంది. అది నిజమే ఎందుకంటే వాటిని ఉతకడం నెల రోజులకు ఒకసారి మాత్రమే, అందుకే ప్రతిసారీ ఇస్త్రీ చేసి ప్రయాణికులకు ఇచ్చేస్తూ ఉంటారు. ఒక ప్రయాణికుడు వాడిన తర్వాత వాటిని తీసి ఇస్త్రీ చేసి తిరిగి ఇంకో ప్రయాణికులకు అందిస్తూ ఉంటారు. దీని వల్ల వారికి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆర్‌టీఐ చట్టం ద్వారా ఒక వ్యక్తి రైల్వేలో ఇచ్చే దుప్పట్లను ఎన్నిసార్లు ఉతుకుతారో తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. రైల్వే వారు అతడికి ఇచ్చిన సమాధానం చూస్తే రైలు ప్రయాణికులకు దిమ్మతిరిగిపోతుంది. రైళ్లలో ఏసీ కోర్సులలో ఇచ్చే దుప్పట్లో నెలకు ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే ఉతుకుతారు. ప్రయాణికుడు వాడిన వెంటనే వాటిని ఉతకరు. కేవలం ఇస్త్రీ చేసి మాత్రమే ఇచ్చేస్తారు. దీనివల్ల ఆ బెడ్ షీట్లపై కోట్ల కొద్ది బ్యాక్టీరియాలు, వైరస్ లు చేరిపోతాయి. కొన్నిసార్లు ఇవి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం అవుతాయి.

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం మన శరీరం రోజు 30 నుంచి 40 వేల చర్మ మృతకణాలను తొలగిస్తుంది. అలాగే చెమట, లాలాజలం, చుండ్రు వీటన్నింటిని వదిలించుకుంటూ ఉంటుంది. అవి ఎక్కువగా పడేది మనం కప్పుకునే బెడ షీట్లపైనే. వీటన్నింటి కలయిక బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు వంటి వాటికి నిలయంగా మారుతుంది. దీనివల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు శరీరంలో చేరే అవకాశం ఉంటుంది.

ఒక రెండు వారాలు పాటు పిల్లో కవర్‌ను వాడితే దానిపై ఉండే బ్యాక్టీరియా… మీ ఇంట్లోని కుక్క తినే గిన్నెపై ఉన్న బ్యాక్టీరియా ల కన్నా 40 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇక బెడ్ షీట్ లలో చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. వాటి నిండా బ్యాక్టీరియా పేరుకు పోతుంది. అందుకే తరచూ వాటర్ ఉతుక్కోమని చెబుతూ ఉంటారు. అలాంటిది నెలకు ఒకసారి 20 నుంచి 30 మంది వాడే దుప్పట్లపై ఎన్ని రకాల బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, వైరస్‌లు చేరుతాయో అర్థం చేసుకోండి. ఇవి కొందరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతాయి.

దుప్పట్లపై ఉండే వైరస్ లు, బ్యాక్టీరియాలు వంటివి మీ చర్మంపై ఉన్నా వైట్ హెడ్స్, పగుళ్లు, గాయాల ద్వారా శరీరంలోకి చొచ్చుకెళ్తాయి. అక్కడ తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం ఉంటుంది.

అలాగే నిమోనియా, గోళ్లు ఇన్ఫెక్షన్ బారిన పడి ఊడిపోవడం, చర్మానికి దురదలు, దద్దుర్లు వంటివి రావడం, తామర వంటి సమస్యలను ఈ బెడ్ షీట్లపై పేర్కొన్న బ్యాక్టీరియా ల వల్ల కలిగే అవకాశం ఉంది.

వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం బెడ్ షీట్లపై ఉండే బ్యాక్టీరియాలు ఎన్నో రకాల అలర్జీలకు కారణం అవుతాయి. వీటివల్ల శ్వాస ఆడక పోవడం వంటి శ్వాస సంబంధిత సమస్యలు మొదలవుతాయి. మీకు తెలియకుండానే ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియాలు చేరి కొన్నాళ్లకు మీకు ఆస్తమా, నిమోనియా వంటి సమస్యలు వచ్చేలా చేస్తుంది. పిల్లల్లో కొత్త అలెర్జీలు, శ్వాస సమస్యలు మొదలవుతాయి. నిద్రలేమి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా అలాంటి ఉతకని బెడ్ షీట్ల మూలాన వచ్చే అవకాశం ఉంది.

వీలైనంతవరకు రైళ్లల్లో ఇచ్చే బెడ్ షీట్లను తీసుకోపోవడమే మంచిది. మీ సొంత బెడ్ షీట్లను తీసుకెళ్లి వాటిని వాడడం ఉత్తమం. ఇంటికి వచ్చాక వాటిని పరిశుభ్రంగా ఉతుక్కోవడం చాలా ముఖ్యమైన విషయం.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024