Brahmamudi October 23rd Episode: కావ్య‌ను బాస్‌గా ఒప్పుకోని రాజ్ -ఆఫీస్‌లో ర‌చ్చ -అనామిక మ‌నిషికి క‌ళావ‌తి వెరైటీ శిక్ష

Best Web Hosting Provider In India 2024


కావ్య మ‌ళ్లీ ఆఫీస్‌లో అడుగుపెట్ట‌డం చూసి రాజ్ ఫైర్ అవుతాడు. తాత‌య్య త‌న‌ను సీఈవోగా అపాయింట్ చేశాడ‌ని జాయినింగ్ లెట‌ర్‌ను రాజ్‌కు చూపిస్తుంది కావ్య‌. ఆ లెట‌ర్ చూసి తాత‌య్య అని కోపంతో గ‌ట్టిగా అరుస్తాడు రాజ్‌. ఇంట్లోటిఫిన్ చేస్తున్న సీతారామ‌య్య‌కు పొల‌మారుతుంది.

ఆఫీస్‌లో రాజ్ వీరంగం మొద‌లుపెట్టిన‌ట్లున్నాడు. అక్క‌డ వేసిన రంకెలు ఇక్క‌డి వ‌ర‌కు వినిపించిన‌ట్లు అనిపించి పొల‌మారింద‌ని భార్య‌తో అంటాడు సీతారామ‌య్య‌. ఆఫీస్‌లో ప‌రిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు కావ్య‌కు ఫోన్‌చేస్తాడు సీతారామ‌య్య‌.

రాజ్‌పై సెటైర్లు…

ఇక నుంచి నాతో మాట్లాడాలంటే అపాయింట్‌మెంట్ తీసుకొని రావాల‌ని రాజ్‌కు కావ్య ఆర్డ‌ర్‌వేస్తుంది కావ్య‌. కావ్య‌కు ఫోన్ చేసిన సీతారామ‌య్య మీ మేనేజ‌ర్ ఏముంటున్నాడ‌నిఅడుగుతాడు. న‌న్ను సీఈవోగా గుర్తించ‌డానికి నిరాక‌రిస్తున్నాడ‌ని కావ్య బ‌దులిస్తుంది. అలా అయితే…ట‌ర్మినేష‌న్ లెట‌ర్ పంపిస్తాన‌ని, ఆ మేనేజ‌ర్‌ను ఉద్యోగం నుంచి తీసేసి ఇంటికిపంపించేయ‌మ‌ని కావ్య‌తో చెబుతాడు సీతారామ‌య్య‌.

తాత‌య్య మాట‌లు విని రాజ్‌ కోపంతో మ‌రింత ఉడుక్కుంటాడు. ఇంటికెళ్లి తాత‌య్య‌తో తేల్చుకుంటాడ‌న‌ని అంటాడు. ఇంటికొస్తే గ‌డ్డిపెట్ట‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని, నా ఆర్డ‌ర్‌ను ధిక్క‌రిస్తే ఊరుకునేది లేద‌ని రాజ్‌కు ఫోన్‌లోనే వార్నింగ్ ఇస్తాడు సీతారామ‌య్య‌. సీఈవోగా అపాయింట్ అయిన కావ్య‌కు ఆశీస్సులు అంద‌జేస్తాడు సీతారామ‌య్య‌.

కావ్య‌కు బొకే ఇచ్చిన రాజ్‌…

కావ్య సీఈవో కావ‌డం వెనుక క‌న‌కం హ‌స్తం ఉంద‌ని రాజ్ అనుమానిస్తాడు. క్యాన్స‌ర్‌ నాట‌కం ఆడిన మీ అమ్మే గూడుపుఠానీ న‌డిపించిందా అని కోప్ప‌డుతాడు. ఈ రోజు మా ఇంట్లో కురుక్షేత్ర సంగ్రామం మొద‌లుకానుంద‌ని రాజ్ అంటాడు.

శృతి బొకే తీసుకొని వ‌స్తుంది. కొత్త‌ సీఈవోగా అపాయింట్ అయిన కావ్య‌కు మా అంద‌రి త‌ర‌ఫున బొకే ఇచ్చి శుభాకాంక్ష‌లు చెప్పాల‌ని రాజ్‌తో అంద‌జేస్తుంది. మ‌ట్టిపిసుక్కొనే స్టేజ్ నుంచి మా కంపెనీ సీఈవోగా దిగ‌జారినందుకు శుభాకాంక్ష‌లు బొకే ఇస్తున్న‌ట్లుగానే న‌టిస్తూ కింద‌ప‌డేసి కాళ్ల‌తో తొక్కేస్తాడు రాజ్‌. నీ క‌ల‌ల్ని ఇలాగే నేల‌పాలు చేస్తాన‌ని కావ్య‌కు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు…

పెద్ద బాధ్య‌త‌…

రాజ్ వెళ్లిపోగానే సీతారామ‌య్య‌కు ఫోన్‌చేస్తుంది కావ్య‌. త‌న‌ను సీఈవోగా అపాయింట్ చేసి త‌న‌పై పెద్ద బాధ్య‌త పెట్టార‌ని ఎమోష‌న‌ల్ అవుతుంది. స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌గ‌ల‌ని న‌మ్మాను…నా న‌మ్మ‌కం త‌ప్పుకాద‌ని నువ్వే నిరూపించాల‌ని కావ్య‌తో అంటాడు సీతారామ‌య్య‌.

కంపెనీ ఎదుగుద‌ల‌లో రాజ్ పాత్ర ఎంతో ఉంద‌ని, అలాంటి కంపెనీలో త‌న స్థానంలో నేను రావ‌డాన్ని రాజ్ జీర్ణించుకోలేక‌పోతున్నాడ‌ని సీతారామ‌య్య‌కు చెబుతుంది కావ్య‌. నీ వ‌ల్ల రాజ్ కోల్పోతున్న‌ది ఏమిటో తెలుసుకోవ‌డానికి ఇదంతా చేస్తున్నాన‌ని సీతారామ‌య్య బ‌దులిస్తాడు. వాడివ‌ల్ల నువ్వు ప‌డిన బాధ‌కంటే మేము ప‌డే బాధ త‌క్కువ‌గానే ఉంటుంద‌ని, ఈ గొడ‌వ‌ల‌న్నీ మ‌ర్చిపోయి కొత్త జీవితం మొద‌లుపెట్ట‌మ‌ని కావ్య‌కు చెబుతాడు సీతారామ‌య్య‌. నీ లైఫ్ అంద‌రికి ఆద‌ర్శంగా ఉండాల‌ని అంటాడు.

రాజ్ ఆక్రోషం…

రాజ్ వ‌చ్చి రావ‌డంతోనే తాత‌య్య అని గ‌ట్టిగా అరుస్తాడు. అత‌డి అరుపుకు అంద‌రూ కిందికివ‌స్తారు. అత‌డి కోపాన్ని ఇది ఉక్రోష‌మా…ఆక్రోష‌మా అని అడుగుతూ సెటైర్లువేస్తారు. ఇప్పుడు నానార్థాలు అవ‌స‌రం లేదంటూ రాజ్ కోపంగా అంటాడు.

కావ్య‌లోని క‌ళ‌కు స‌న్మానం…

సీతారామ‌య్య‌రాగానే…క‌ళావ‌తినీ సీఈవోను చేసి న‌న్ను అవ‌మానించారు అంటూ తాత‌య్య‌ను నిల‌దీస్తాడు రాజ్‌. కావ్య‌లోని క‌ళ‌ను గుర్తించి తాను చేసిన స‌న్మాన‌మ‌ని మ‌న‌వ‌డికి ఆన్స‌ర్ ఇస్తాడు సీతారామ‌య్య‌. నేను కంపెనీని న‌డ‌ప‌లేన‌ని అనుకున్నారా, ఇలాంటి నిర్ణ‌యం తీసుకొనే ముందు నాకు ఒక్క మాట ఎందుకు చెప్ప‌లేద‌ని రాజ్ ఫైర్ అవుతాడు.

కావ్య‌ను ఇంట్లో నుంచి పంపించేముందు నువ్వు ఒక్క మాట మాతో చెప్పేవా…నేను నీ అనుమ‌తి తీసుకోవ‌డం ఏంటి బుర్రుండి మాట్లాడుతున్నావా అంటూ రాజ్‌కు క్లాస్ ఇస్తాడు సీతారామ‌య్య‌. నీలో అవ‌ల‌క్ష‌ణాలు పెట్టుకొని మ‌మ్మ‌ల్ని ప్ర‌శ్నించే అధికారం నీకు లేద‌ని అంటాడు సీతారామ‌య్య‌.

రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి రివ‌ర్స్‌…

అహంకార‌తో కావ్య‌తో అవార్డుల విష‌యంలో పోటీకి వెళ్లి కంపెనీ ప‌రువు తీశావ‌ని గాలి తీస్తాడు. కావ్య లేకుండా అవార్డు కూడా తెచ్చుకోలేక‌పోయావ‌ని రాజ్‌తో అంటాడు సీతారామ‌య్య‌. . కావ్య‌ను సీఈవోను చేయ‌డం నాకు న‌చ్చ‌లేద‌ని అంటాడు రాజ్‌. త‌మ‌కు న‌చ్చ‌లేద‌ని రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి అంటారు. మీ బోడి అభిప్రాయం ఎవ‌రు అడిగారు న‌చ్చితే ఎంత‌…న‌చ్చ‌క‌పోతే ఎంత అని ప్ర‌కాశం గాలితీసేస్తాడు.

అన్యాయాన్ని ప్ర‌శ్నించేవారు లేరా….

రాజ్ ఇంత‌కుముందులా స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌డం లేద‌ని, వ్య‌క్తిగ‌త కోపానికి కంపెనీని బ‌లిచేస్తున్నాడ‌ని, రోజురోజుకు రాజ్‌లో మూర్ఖ‌త్వం పెరిగిపోతుంద‌ని సీతారామ‌య్య అంటాడు. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌శ్నించేవారు లేరా అని కుటుంబ‌స‌భ్యుల‌ను అడుగుతాడు రాజ్‌.

నేనున్నాన‌ని రుద్రాణి అంటుంది. ఏడాదిగా రాజ్ కంపెనీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడ‌ని, అవార్డు రావాల‌ని నిద్రాహారాలు మానేసి ప‌నిచేశాడ‌ని రుద్రాణి అంటుంది. అయినా ఫ‌లితం ఏది అని సీతారామ‌య్య అడ‌గ‌టంతో రుద్రాణి సెలైంట్ అవుతుంది.

ముగ్గురు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు..

మ‌న ఇంటితో సంబంధం లేద‌ని వెళ్లిపోయిన కావ్య‌కు ఇలా పెత్త‌నం ఇవ్వ‌డం బాగాలేద‌ని ధాన్య‌ల‌క్ష్మి అడుగుతుంది.అనామిక ఇంటితో బంధం తెచ్చుకొని వెళ్లిపోయింది. అప్పు నీ గుణం అర్థం చేసుకొని ఇంటికి దూర‌మైంది.రాజ్ తీరు న‌చ్చ‌కకావ్య‌ వెళ్లిపోయింది. కంపెనీ కూడా ఇళ్లులా త‌యార‌వ్వ‌కూడ‌ద‌నే కావ్య‌ను సీఈవోను చేశాన‌ని, ఇది ఇంటి పెద్ద‌గా తాను తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని, ఎవ‌రూ మార్చ‌లేర‌ని తీర్పు ఇస్తాడు సీతారామ‌య్య‌.

క‌ళ్యాణ్ పాట ఫేమ‌స్‌…

క‌ళ్యాణ్ ఆటోను కొంద‌రు పాసింజ‌ర్స్ ఎక్కుతారు. ప్రేమ‌తో అనే మూవీలోని ఓ ల‌వ్ సాంగ్ ఫేమ‌స్ అయ్యింద‌ని అంటారు. తాను రాసిన పాట ఫేమ‌స్ కావ‌డం చూసి క‌ళ్యాణ్ సంతోష‌ప‌డ‌తాడు. ల‌క్ష్మికాంత్ అనే రైట‌ర్ త‌ర‌ఫున తానే ఆ పాట రాసిన విష‌యం వారితో చెప్ప‌లేక‌పోతాడు. పాట న‌చ్చింది అన్నందుకు థాంక్స్ అని అంటాడు. ఆ పాట ఏదో నువ్వే రాసిన‌ట్లు ఫీలైపోతున్నావేంట‌ని వాళ్లు అంటారు. అంత అందంగా పాట రాయ‌డం ఎంత క‌ష్ట‌మో తెలుసాన‌ని కోపంగా చెబుతారు.

ఆఫీస్ దొంగ‌నుప‌ట్టుకున్న కావ్య‌…

కావ్య‌ను ఆఫీస్ నుంచి పంపించేయ‌డానికి అనామిక కుట్ర‌ప‌న్నుతుంది. కావ్య ఆఫీస్‌లో ఏం చేస్తుంది అన్న‌ది ఏ రోజుకారోజు త‌న‌తో చెప్పాల‌ని త‌న‌కు న‌మ్మిన బంటు అయినా వ్య‌క్తి ఫోన్ చేసి చెబుతుంది. రాజ్ మాదిరిగా కావ్య‌ను న‌మ్మించ‌లేమ‌ని, మ‌హాముదురులా ఉంద‌ని ఆ ఎంప్లాయ్ చెబుతుండ‌గా అక్క‌డికి స‌డెన్‌గా కావ్య ఎంట్రీ ఇస్తుంది.

అనామిక‌కు వార్నింగ్‌…

అత‌డి ద‌గ్గ‌ర నుంచి ఫోన్ తీసుకొని తాను అనామిక‌తో మాట్లాడుతుంది. స్వ‌రాజ్ గ్రూప్ సీఈవోను మాట్లాడుతున్నాన‌ని అంటుంది. నువ్వు తెలివిగా మా అత్త‌గారి కంపెనీని దెబ్బ‌కొట్టాల‌ని చూశావు…నేను అమాయ‌కంగా మోస‌పోయి మా కంపెనీ అవార్డు రాకుండా చేశాను. అది నీ గెలుపు కాదు…నీ ప‌త‌నానికి దారి. ఇక‌పై నేను నిన్ను దెబ్బ‌కొడ‌తాను. కోలుకోలేని దెబ్బ‌కొడ‌తాన‌ని వార్నింగ్ ఇస్తుంది.

వెరైటీ శిక్ష‌…

త‌మ కంపెనీ ర‌హ‌స్యాల‌ను అనామిక‌కు చేర‌వేస్తున్న వ్య‌క్తి బాగోతాన్ని కంపెనీలోని అంద‌రికి తెలియ‌జేస్తుంది కావ్య‌..మా అత్త‌గారు హాస్పిట‌ల్ పాల‌వ్వ‌డానికి, రాజ్‌, త‌న‌కు మ‌ధ్య విభేదాలు రావ‌డానికి కార‌ణం ఇత‌నేన‌ని అంద‌రికి చెబుతుంది. అత‌డిపై పోలీస్ కంప్లెంట్ ఇవ్వ‌డంతో పాటు ఉద్యోగంలోని తీసేద్దామ‌ని ఎంప్లాయ్స్ అంటారు. అత‌డికి వెరైటీ శిక్ష వేయ‌బోతున్న‌ట్లు కావ్య అంటుంది. సెక్ష‌న్ మేనేజ‌ర్ నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా అత‌డికి డీమోట్ చేస్తుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఎపిసోడ్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024