Uppundalu: కరకరలాడే ఉప్పుండలు, సింపుల్‌గా రెడీ అయ్యే స్నాక్ రెసిపీ

Best Web Hosting Provider In India 2024

సాయంత్రం పూట తినేందుకు చేయదగ్గ సింపుల్ చిరుతిండి ఉప్పుండలు. వీటి కోసం కొత్త పదార్థాలేవీ అక్కర్లేదు. మీకు అందుబాటులో ఉండే వాటితోనే రెడీ అయిపోతాయి. తినేందుకు చాలా క్రిస్పీగా ఉప్పగా ఉండే ఈ ఉప్పుండల రెసిపీ ఎలాగో చూసేయండి. పిల్లలకు మంచి స్నాక్ ఇది.

ఉప్పుండల తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు బియ్యం పిండి

1 కప్పు మినపప్పు

అర చెంచా జీలకర్ర

పావు టీస్పూన్ ఇంగువ

2 చెంచాల నువ్వులు

అర చెంచాడు ఉప్పు

2 చెంచాల నెయ్యి లేదా బటర్

3 చెంచాల శనగపప్పు

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

ఉప్పుండల తయారీ విధానం:

  1. ముందుగా ఉప్పుండల కోసం మినప్పప్పును సన్నం మంట మీద వాసన వచ్చేదాకా వేయించాలి.
  2. ఈ పప్పు చల్లారాక దాన్ని మిక్సీలో వేసుకుని వీలైనంత సన్నగా పిండి పట్టుకోవాలి.
  3. ఇప్పుడు కడాయిలో బియ్యం పిండి కూడా వేసుకుని సన్నం మంట మీద రెండు నిమిషాలు వేయించాలి. అస్సలు పిండి మాడిపోకూడదని గుర్తుంచుకోండి.
  4. ఈ పిండిని కూడా మినప్పప్పు పొడి ఉన్న పల్లెంలోకి తీసుకోండి. ఈ రెండు పిండ్లు కలిపి ఒకేసారి జల్లెడ పట్టండి.
  5. ఇప్పుడు శనగపప్పును కూడా పావుగంటసేపు నీళ్లలో నానబెట్టుకోవాలి.
  6. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్‌లో బియ్యం పిండి, మినప్పప్పు పిండి, జీలకర్ర, ఇంగువ, నువ్వులు, ఉప్పు, నెయ్యి వేసుకుని కలుపుకోండి. అందులోనే నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి పిండి కలుపుకోండి.
  7. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని పిండిని ముద్దలాగా కలుపుకోండి. పాత్ర అంచులకు, చేతికి పిండి అంటుకోకుండా ఉండాలి.
  8. ఇప్పుడు చేయికి కాస్త నూనె రాసుకుని కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. వాటిని పావుగంట సేపు పక్కన పెట్టుకోండి.
  9. కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక ముందుగా రెడీ చేసి పెట్టుకన్న ఉండల్ని వేసి వేయించుకోండి.
  10. కాసేపటికే ముదురు బంగారు వర్ణంలోకి మారి క్రిస్పీగా తయారవుతాయి. వాటిని బయటకు తీసుకుని చల్లారాక ఒక డబ్బాలో వేసుకుని నిల్వ చేసుకోండి. ఉప్పుండలు రెడీ అయినట్లే.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024