Bra Colour: తెలుపు రంగు డ్రెస్‌కు అదే రంగు బ్రా వాడకండి, దేనికి ఏ రంగు బ్రా వాడాలో చూడండి

Best Web Hosting Provider In India 2024

బ్రా సరైన సైజుతో, ఫిట్టింగ్‌తో ఉండటం ఎంత ముఖ్యమో.. డ్రెస్ రంగును బట్టి సరైన రంగు బ్రా ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఏ రంగు బ్రాను ఎలాంటి రంగు డ్రెస్సుల మీద వాడొచ్చో, వాడకూడదో సరైన అవగాహన ఉండాలి. దానివల్ల కాస్త పారదర్శకంగా ఉండే డ్రెస్సుల మీద కూడా నప్పే రంగు బ్రా వేసుకుంటే అసౌకర్యంగా అనిపించదు. బయటకు కనిపించదు. కొన్ని బ్రాలు కొన్ని రంగుల మీదికి మాత్రమే వాడాలి. తెలీకుండా తప్పుగా వాడితే మీకూ సౌకర్యంగా అనిపించదు. అవన్నీ వివరంగా తెల్సుకోండి.

బ్లాక్ బ్రా:

ప్రతి అమ్మాయి దగ్గర ఉండాల్సిన బ్రా రంగుల్లో నలుపు రంగు బ్రా ఒకటి. అయితే వీటిని అన్ని రంగుల డ్రెస్సుల మీదికి వేసుకోలేరు. ముదురు రంగు డ్రెస్సుల మీదికి ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. బ్లూ, బ్రౌన్, పర్పుల్, బ్లాక్, మెరూన్, ముదురు ఆకుపచ్చ .. లాంటి రంగు డ్రెస్సుల కిందికి తప్పకుండా నలుపు రంగు బ్రా ఎంచుకోవాలి. అయితే తెలుపు రంగు డ్రెస్సులకు మాత్రం నలుపు రంగు బ్రా ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. ఇది స్పష్టంగా బయటకు కనిపిస్తుంది అని గుర్తుంచుకోండి.

తెలుపు రంగు బ్రా:

తెలుపు రంగు బ్రాను తెలుపు రంగు డ్రెస్సుల మీదకి వేసుకోవచ్చని అందరూ అనుకుంటారు. కానీ అది ముమ్మాటికి తప్పు. తెలుపు కింద తెలుపు వేసుకుంటే బ్రా ఆకారం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ మరీ లేత రంగు డ్రెస్సులు వేసుకున్నప్పుడు తెలుపు రంగు బ్రా వేసుకుంటే బ్రా మీద క్యామిసోల్ లేదా ట్యాంక్ టాప్ తప్పకుండా వేసుకోవాలి. అలా కాకుండా కాస్త మందంగా ఉన్న ఎలాంటి రోజూ వారీ డ్రెస్సులమీదకి అయినా తెలుపు రంగు బ్రా రోజూవారీ వాడుకోవచ్చు.

ఎరుపు రంగు బ్రా:

తెలుపు రంగు బట్టలు వేసుకున్నప్పుడు తెలుపు రంగు బ్రా వద్దు, నలుపు రంగు బ్రా కూడా వద్దు అనుకున్నాం కదా. మరింకేం వేసుకోవచ్చు అనుకుంటున్నారా? ఎరుపు రంగు బ్రా.. అవును మీరు విన్నది కరెక్టే. మీ చర్మం రంగులో మీరెంచుకున్న ఎరుపు రంగు బ్రా ఎంతలా కలిసిపోతే అంత మేలు. తెలుపు బట్టలు వేసుకున్నప్పుడు బ్రా ఆకారం కనిపించదు. మీ చర్మం రంగు మరీ తెలుపు అయితే లేత ఎరుపు రంగు, లేత గులాబీ రంగు బ్రా ఎంచుకోవాలి. చామన చాయ అయితే కాస్త ముదురు రంగు రెడ్ బ్రా, మెరూన్ రంగు బ్రా.. ఎంచుకోవాలి.

న్యూడ్ బ్రా:

అంటే మీ చర్మం రంగుతో కలిసిపోయే బ్రా అనుకోవచ్చు. చర్మం మీద వేసుకున్నట్లు కూడా తెలీనట్లు ఉంటుంది వీటి రంగు. అందుకే దాదాపు అన్ని రకాల డ్రెస్ మీదకి ఇవి నప్పేస్తాయి. గీతలున్న టీషర్టు అయినా, ఏ రంగు టీషర్టు మీద అయినా వీటిని వేసుకోవచ్చు. చర్మం రంగులో కలిసిపోతాయి కాబట్టి బ్రా రంగు కొట్టినట్లు కనిపించదు. ముఖ్యంగా తెలుపు రంగు బట్టల మీదికి కూడా న్యూడ్ బ్రా సరిపోతుంది.

 

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024