OTT Kannada Romantic Drama: రెండేళ్ల తర్వాత తెలుగులో ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ కన్నడ రొమాంటిక్ డ్రామా

Best Web Hosting Provider In India 2024

OTT Kannada Romantic Drama: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రొమాంటిక్ డ్రామా లవ్ మాక్‌టేల్ (Love Mocktail). 2020లో ఈ మూవీ థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రెండేళ్లకు 2022లో లవ్ మాక్‌టేల్ 2 అంటూ సీక్వెల రిలీజై అది కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడా సీక్వెలే రెండేళ్ల తర్వాత తెలుగులో డబ్ అయి ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

లవ్ మాక్‌టేల్ 2 ఓటీటీ రిలీజ్ డేట్

కన్నడ రొమాంటిక్ డ్రామా అయిన లవ్ మాక్‌టెయిల్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.21 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో డబ్ చేశారు. లవ్ మాక్‌టేల్ 2 మూవీని ఈటీవీ విన్ ఓటీటీ అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమవుతోంది. డార్లింగ్ కృష్ణ నటించి, డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు కన్నడ నాట ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

లవ్ మాక్‌టేల్ 2 కథేంటంటే?

లవ్ మాక్‌టేల్ 2 మూవీలో డార్లింగ్ కృష్ణతోపాటు మిలనా నాగరాజ్, రచన ఇందర్, రేచెల్ డేవిడ్, అమృతా అయ్యంగార్, ఖుషీ ఆచార్, సుష్మితా గౌడలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ డార్లింగ్ కృష్ణ.. ఆదిత్య అనే పాత్ర పోషించాడు. తొలి భాగంలో తన భార్య నిధిని కోల్పోతాడు ఆదిత్య. ఆ తర్వాత రెండేళ్లకు ఈ సీక్వెల్ స్టోరీ మొదలవుతుంది.

తన భార్యను కోల్పోయిన బాధ నుంచి కోలుకొని జీవితంలో మళ్లీ నిలదొక్కుకోవాలని ఆదిత్య చూస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఓ నటుడిగా, దర్శకుడిగా ఈ సినిమా చేయడం తనకు భిన్నమైన అనుభూతిని కలిగించినట్లు డార్లింగ్ కృష్ణ అప్పట్లో చెప్పాడు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం తనకుందని అన్నాడు.

లవ్ మాక్‌టేల్ 2 బాక్సాఫీస్

2020లో వచ్చిన లవ్ మాక్‌టేల్ మూవీ సక్సెస్ కావడంతో భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్ రిలీజైంది. ఊహించినట్లే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.21 కోట్లు వసూలు చేయడం విశేషం. తొలి రోజే రూ.1.42 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ వీకెండ్ రూ.10 కోట్లకుపైనే వచ్చాయి. దీంతో మూవీని బ్లాక్ బస్టర్ హిట్ గా డిక్లేర్ చేశారు. ఇప్పుడా సినిమా తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024