Nushrratt Bharuccha car: రూ.2 కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ.. తనకు తానే దీపావళి గిఫ్ట్

Best Web Hosting Provider In India 2024

Nushrratt Bharuccha car: బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నుష్రత్ బరూచా. ఇప్పుడామె ఎంతో ఖరీదైన రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసింది. దీని ధర ఏకంగా రూ.2 కోట్లు కావడం విశేషం. ఈ కొత్త కారుతో ఆమె గురువారం (అక్టోబర్ 24) ముంబైలోని ప్రముఖ సిద్ది వినాయకుడి ఆలయానికి రావడంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

నుష్రత్ బరూచా లగ్జరీ కారు

బాలీవుడ్ లో పలు హిట్ మూవీస్ లో నటించిన నటి నుష్రత్ బరూచా. ఆమె ఇప్పుడు దీపావళి రానున్న వేళ తనకు తానే రూ.2 కోట్లతో కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చుకుంది. ఈ సందర్భంగా పూర్తి సాంప్రదాయ దుస్తుల్లో ఆమె గురువారం సిద్ది వినాయకుడిని దర్శించుకుంది. అక్కడే తన కొత్త కారుతో ఆమె పలు ఫొటోలకు పోజులిచ్చింది.

కొత్త కారు కొనడంతో మొదట దానిని ఆలయానికే తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆమె తన తల్లితో కలిసి సిద్ది వినాయకుడి గుడికి వచ్చింది. ఆ తర్వాత నుష్రత్.. గుడి బయట ఉన్న వారికి ఆర్థిక సాయం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆలయానికి కావడంతో నుష్రత్ పూర్తి సాంప్రదాయ దుస్తుల్లో అక్కడికి వచ్చింది.

నుష్రత్ కెరీర్ ఇలా..

నుష్రత్ బరూచా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. నిజానికి 2006లోనే జై సంతోషి మా మూవీతో నటన ప్రారంభించింది. ఆ తర్వాత 2011లో వచ్చిన లవ్ రంజ్ మూవీ ప్యార్ కా పంచనామాతో పాపులర్ అయింది.

ఆ తర్వాత సోనూ కే టీటూ కీ స్వీటీ, చోరీ, డ్రీమ్ గర్ల్, చలాంగ్ లాంటి హిట్ మూవీస్ లో నటించింది. నుష్రత్ ఇప్పుడు చోరీ మూవీ సీక్వెల్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఇప్పటి వరకూ చిన్న సినిమాల్లో నటించిన నుష్రత్.. ఏకంగా రూ.2 కోట్లు పెట్టి లగ్జీర కారు కొనడం మాత్రం అభిమానులు ఆసక్తి నింపుతోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024