RGV: వాటి ద్వారా విచ్చలవిడితనం పెరిగిపోతోంది, అమ్మాయిలు నిజాలు గ్రహించట్లేదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Ram Gopal Varma Comments: డిఫరెంట్ కంటెంట్‌లతో, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తుంటారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అలాగే, కొత్త వారితో ప్రయోగాలు చేయడంలో ముందుండే సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘శారీ’. ఆర్జీవీ డెన్ నుంచి వస్తున్న ఈ సినిమాకు ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనేది ట్యాగ్ లైన్.

బిజినెస్ మ్యాన్ రవి నిర్మాతగా

పలు నిజ జీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌గా శారీ చిత్రాన్ని రూపొందించారు. ఆర్జీవీ-ఆర్వీ (RGV- AARVI) ప్రొడక్షన్ బ్యానర్‌లో ప్రముఖ బిజినెస్ మ్యాన్ రవి వర్మ శారీ చిత్రాన్ని నిర్మించారు. అలాగే, శారీ చిత్రానికి గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించారు. ఇందులో భయానక ప్రేమికుడిగా సత్య యాదు నటించాడు.

సెగలు రేపే చీరలోని అమ్మాయి

అలాగే, అతనిలో సెగలు రేపే చీరలోని అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది. కాగా, ఈ శారీ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో డిసెంబర్ 20న విడుదల కానుంది. ‘శారీ’ చిత్రం ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

ప్రముఖ పంపిణీ దారుడు ముత్యాల రాందాస్ మంచి ఫాన్సీ రేట్‌తో శారీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, శారీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఆకర్షితులు అవుతున్నారు

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. “ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా భయానకమైన రిలేషన్స్‌కి తెరలు లేపుతుంది. సోషల్ మీడియా అనేది జనానికి మేలు చేయకపోగా ‘యాంటీ సోషల్ మీడియా’గా మారుతోంది. ‘ఇన్ స్టాగ్రామ్‘ వంటి యాప్‌ల ద్వారా చాలామందిలో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. పడచు అమ్మాయిలు వాటిలోని నిజాలను గ్రహించలేక ఆకర్షితులవుతున్నారు” అని తెలిపారు.

కనువిప్పు కలిగేలా

“మితిమీరిన ప్రేమ ఎంత భయంకరంగా మారొచ్చు అనేది ఈ శారీ చిత్రంలోని ప్రధాన అంశం. వయసులో ఉన్న అమ్మాయిలకు కనువిప్పు కలిగేలా ఈ సినిమా తెరకెక్కింది” అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఈవెంట్‌లో శారీ నిర్మాత రవి వర్మ సైతం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నాలుగు భాషల్లో రిలీజ్

నిర్మాత రవి వర్మ మాట్లాడుతూ.. “ఇటీవల ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ప్రక్రియతో రికార్డు చేసిన ‘ఐ వాంట్ లవ్’ అనే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ లిరికల్, ఫుల్ వీడియో సాంగ్ ‘ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ ద్వారా విడుదల చేశాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో లిరికల్ సాంగ్‌ను విడుదల చేస్తాము. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో శారీ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అని వెల్లడించారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024