Pushpa 2 Screens: ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా పుష్ప 2 రికార్డ్.. ఎన్ని స్క్రీన్స్‌లలో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Pushpa 2 Screens Record: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ మోస్ట్ అవేయిటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులతోపాటు ఇండియన్ ఆడియెన్స్ సైతం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీంతో పుష్ప 2 ది రూల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే పుష్ప 2 రిలీజ్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ప్రమోషనల్ కంటెంట్‌తో

బ్రిలియంట్‌ డైరెక్టర్‌, లెక్కల మాస్టర్ సుకుమార్‌ డైరెక్ట్ చేస్తున్న పుష్ప 2 చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా శ్రీవల్లి పాత్రలో మరోసారి అలరించనుందని తెలిసిందే. అయితే, రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

సెన్సేషనల్ న్యూస్

ఇప్పటికై విడుదలైన పుష్ప 2 టీజర్‌, రెండు పాటలు ఎంతటి సెన్సేషన్స్‌ క్రియేట్ చేశాయే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పుష్ప 2 ది రూల్ మూవీని డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ఇటీవల జరిగిన నేషనల్‌ ప్రెస్‌మీట్‌లో తెలియజేశారు నిర్మాతలు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో సెన్సేషనల్‌ న్యూస్‌ను వెల్లడించారు మేకర్స్‌.

ఇండియా, ఓవర్సీస్‌లో

పుష్ప-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి మొత్తం 11,500 స్త్రీన్స్‌లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్‌ తెలిపారు. ఇండియాలో 6500 స్క్రీన్స్‌లలో, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లో గ్రాండ్‌ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఇది బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

బిగ్గెస్ట్ రిలీజ్‌గా

ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నాయి ఇండియన్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌. అంటే, ఇండియన్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా పుష్ప 2 చిత్రం రికార్డ్ క్రియేట్ చేయనుంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారని సమాచారం.

కలెక్షన్స్‌లలో కూడా

అలాగే, పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల పరంగా కూడా ఎన్నో సంచలనాలు సృష్టిస్తుందని జోస్యం చెబుతున్నారు ట్రేడ్‌ విశ్లేషకులు. ఇలా పుష్ప 2 రికార్డులు కొల్లగొట్టే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇకపోతే బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలింగా తెరకెక్కిన పుష్ప 2 సినిమాను భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

సుకుమార్ రైటింగ్స్‌తో

పుష్ప 2 చిత్రానికి నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో పుష్ప 2 ది రూల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2లో బన్నీ, రష్మికతోపాటు అనసూయ, జగపతిబాబు, సునీల్, బిగ్ బాస్ దివి, పుష్ప జగదీష్ ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024