Horror OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన ఐదు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి హ‌న్సిక హార‌ర్ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Best Web Hosting Provider In India 2024

Horror OTT: హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన హార‌ర్ మూవీ గార్డియ‌న్‌ థియేట‌ర్ల‌లో రిలీజైన ఐదు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 30 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

అమెజాన్ ప్రైమ్‌లో…

ఇప్ప‌టికే గార్డియ‌న్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఆహా త‌మిళ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. గార్డియ‌న్ మూవీకి గురు శ‌ర‌వ‌ణ‌న్ శ‌బ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సురేష్ చంద్ర‌మీన‌న్‌, శ్రీమాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. డైరెక్ట‌ర్ విజ‌య్ చంద‌ర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.

డిజాస్ట‌ర్ రెస్పాన్స్‌…

హ‌న్సిక హీరోయిన్‌గా న‌టించ‌డంతో గార్డియ‌న్‌పై త‌మిళంలో ఓ మోస్తారు అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రొటీన్ రివేంజ్ ఫార్ములా స్టోరీ కార‌ణంగా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా ఈ మూవీ నిలిచింది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే థియేట‌ర్ల‌లో క‌నిపించ‌కుండాపోయింది. హ‌న్సిక యాక్టింగ్‌పై విమ‌ర్శ‌లొచ్చాయి.

గార్డియ‌న్ మూవీ క‌థ ఇదే…

అప‌ర్ణ‌ను (హ‌న్సిక‌) చిన్న‌త‌నం నుంచి దుర‌దృష్టం వెంటాడుతుంటుంది. ఏది కోరుకున్నా అది జ‌ర‌గ‌దు. దాంతో అన్‌ల‌క్కీ అప‌ర్ణ గా ఆమె పేరు మారిపోతుంది. అనుకోకుండా అప‌ర్ణ‌కు క్రిస్ట‌ల్ (మెరుపు రంగు రాయి) దొరుకుతుంది. అప్ప‌టి నుంచి అప‌ర్ణ జీవిత‌మే మారిపోతుందఆమె ఏది కొరుకుంటే అది జ‌రిగిపోవ‌డం మొద‌లుపెడుతుంది. కే అనే పెద్ద క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలో జాబ్ వస్తుంది. అప‌ర్ణ‌కు దూర‌మైన‌ ల‌వ‌ర్ ప్ర‌భ కూడా ఆమెకు మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వుతాడు.

చావుల‌కు కార‌ణం ఎవ‌రు?

ఆఫీస్‌లో త‌న ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌తో పాటు కంపెనీ హెడ్ త‌మ్ముడి కార‌ణంగా అప‌ర్ణ‌తో పాటు మిగిలిన ఉద్యోగులంద‌రూ ఇబ్బందులు ప‌డుతుంటారు. వారిద్ద‌రు చ‌నిపోతే బాగుండున‌ని అప‌ర్ణ కోరుకుంటుంది. ఆమె క‌ళ్ల ముందే ఇద్ద‌రు దారుణంగా చ‌నిపోతారు.

అప‌ర్ణ మ‌న‌సులో కోరుకున్న కోరిక‌ల‌న్నీ ఎలా నెర‌వేరుతున్నాయి? ఆమె కోరిక‌ల‌కు ఆ క్రిస్ట‌ల్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ క్రిస్ట‌ల్‌లో బంధించ‌బ‌డిన మీరా అనే ఆత్మ క‌థేమిటి? మీరా ఎలా చ‌నిపోయింది? మీరా జ‌రిగిన అన్యాయంపై అప‌ర్ణ ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. గార్డియ‌న్ మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు.

వెబ్‌సిరీస్‌ల‌పై ఫోక‌స్‌…

2024లో గార్డియ‌న్‌తో పాటు తెలుగులో సింగిల్ క్యారెక్ట‌ర్‌తో 105 మినిట్స్ అనే సినిమా చేసింది. రెండు సినిమాలు ఫెయిల్యూర్స్‌గా నిలిచి హ‌న్సిక‌కు నిరాశ‌నే మిగిల్చాయి. సినిమా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో ఓటీటీవైపు దృష్టిసారిస్తోంది. గ‌త ఏడాది మైత్రీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది. ప్ర‌స్తుతం తెలుగులో న‌షా అనే వెబ్‌సిరీస్‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు తెలుగులో డ్యాన్స్ రియాలిటీ షో ఢీకి జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024