Gas Leakage: ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యిందా? ఈ తప్పులు చేయొద్దు, ప్రమాద నివారణకు 10 మార్గాలు ఇవే!

Best Web Hosting Provider In India 2024

ప్రతి ఒక్కరి వంటగదిలో ఎల్‌పిజి సిలిండర్ ఉండటం మామూలు. అయితే కొన్నిసార్లు గ్యాస్ లీక్ అవుతున్నట్లు వాసన వస్తుంది. వాసన రాగానే సిలిండర్ పేలుతుందనే భయమూ మొదలైపోతుంది. అలాంటప్పుడు వెంటనే కొన్ని పనులు చేయాలి. అవి లీకేజ్ ఆపడమే కాకుండా ప్రమాదాన్ని నివారిస్తాయి. మీ భద్రత కోసం మీరు తెల్సుకోవాల్సిన అంశాలివే.

గ్యాస్ లీక్ అయితే వెంటనే ఏం చేయాలి?

1. గ్యాస్ లీకైనప్పుడు ముందుగా భయాందోళన వద్దు. మీరు భయపడితే తక్షణ పరిష్కారాలు తోచవు. ఇంటిలోని ఇతర సభ్యులకు కూడా అదే విషయం చెప్పండి.

2. వాసన రాగానే  మీ ఇంట్లో ఎక్కడైనా దీపం, క్యాండిల్ లాంటివి వెలిగించి ఉంటే ముందుగా అవి ఆర్పేయండి. దూప్ స్టిక్స్ లాంటివి ఉన్నా నీరు పోసి ఆర్పేయండి. సిగరెట్లు కాల్చడం, లైటర్లు, ముఖ్యంగా అగ్గిపుల్ల అంటించొద్దు.

3. గ్యాస్ బయటకు పోవడానికి ముందుగా ఇంటికి ఉన్న అన్ని కిటికీలు, తలుపులను తెరవండి. తొందరగా గ్యాస్ బయటకు పోతుందని ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆఫ్ చేస్తారు. అది తప్పు. అలా కాకుండా గ్యాస్ సహజంగానే వెళ్లేలా చూడండి. దానివల్ల గ్యాస్ ఒకేసారి బయటకు చేరడం, లేదా ఫ్యాన్ నుంచి చిన్న స్పార్క్ లాంటివి వచ్చినా ప్రమాదం రావచ్చు.

4. వెంటనే గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి సిలిండర్ మీద సేఫ్టీ క్యాప్ పెట్టేయండి. 

5. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లి కరెంట్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇంట్లో ఉన్నవాళ్లంతా ఇంటి బయటకు వెళ్లిపోండి.  

6. మీరు పెద్ద మొత్తంలో గ్యాస్ పీల్చినట్లయితే, వెంటనే వాటిని తాజా గాలి వచ్చే ప్రాంతానికి వెళ్లండి. కాసేపు బాగా గాలి ఆడే చోట సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోండి.

7. గ్యాస్ మీ బట్టలు మరియు చర్మానికి బాగా తాకితే, వాసన వస్తుంటే వెంటనే ఆ దుస్తులను తొలగించండి. మీ శరీరాన్ని నీటితో బాగా కడిగేసుకోండి. అవసరమైతే వైద్య సహాయం తీసుకోండి.

8. గ్యాస్ కళ్లలోకి పోతే దురద, చికాకు కలుగుతుంది. అందుకే 15-20 నిమిషాల పాటు కళ్లను నీటితో కడుక్కుంటూ ఉండండి. కళ్లను నీటితో తడిగా ఉంచాలి.

9. సేఫ్టీ క్యాప్ పెట్టిన తర్వాత కూడా సిలిండర్ కు మంటలు అంటుకుంటే ఆందోళన చెందవద్దు. తడి టవల్ లేదా తడి కాటన్ క్లాత్ తీసుకుని రోలర్ చుట్టూ కట్టాలి. ఇది మంటకు గాలి సరఫరాను ఆపివేస్తుంది. మంటలను తగ్గిస్తుంది.

10. సిలిండర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ప్రదేశం నుంచి మరో చోటికి తరలించవద్దు. దీనివల్ల ప్రమాదం పెరగొచ్చు.

పైన చెప్పినవన్నీ చేసిన తర్వాత, లేదా చేసేలోపే హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి లీకేజీ గురించి తెలియజేయండి. వారు వచ్చి మీకు సహాయం చేస్తారు.

 

 

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024