Shahrukh Khan Tv Serial: షారుఖ్‌ఖాన్ న‌టించిన టీవీ సీరియ‌ల్ 36 ఏళ్ల త‌ర్వాత‌ రీ టెలికాస్ట్ – ఏ ఛానెల్‌లో చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024

Shahrukh Khan Tv Serial: బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ యాక్టింగ్ కెరీర్ టీవీ సీరియ‌ల్‌తోనే మొద‌లైంది. ఫౌజీ అనే టీవీ సీరియ‌ల్‌తో ఫ‌స్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చాడు షారుఖ్‌ఖాన్‌. 1989లో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మైన ఈ టీవీ సీరియ‌ల్‌లో లెఫ్టినెంట్ అభిమ‌న్యురాయ్ అనే ఆర్మీ ఆఫీస‌ర్‌గా షారుఖ్‌ఖాన్ క‌నిపించాడు.

ఈ సీరియ‌ల్‌లో సెకండ్ లీడ్ హీరోగా షారుఖ్‌ఖాన్ క‌నిపించాడు. కేవ‌లం ప‌ద‌మూడు ఎపిసోడ్స్‌తోనే ఫౌజీ సీరియ‌ల్‌ను రాజ్ కుమార్ క‌పూర్ తెర‌కెక్కించారు. 1989లో దూర‌ద‌ర్శ‌న్‌లో టెలికాస్ట్ అయినా ఈ సీరియ‌ల్ అప్ప‌ట్లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది.

రిపీట్ టెలికాస్ట్‌…

దాదాపు 36 ఏళ్ల త‌ర్వాత షారుఖ్‌ఖాన్ ఫౌజీ సీరియ‌ల్ రిపీట్ టెలికాస్ట్ రూపంలో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. దూర‌ద‌ర్శ‌న్ ఛానెల్ ఈ సీరియ‌ల్‌ను రీ టెలికాస్ట్ చేస్తోంది. సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఈ సిరీయ‌ల్ ప్ర‌సారం కానుంది. అలాగే రాత్రి ప‌ద‌కొండున్న‌ర గంట‌ల‌కు మ‌రోసారి ఈ సీరియ‌ల్‌ను దూర‌ద‌ర్శ‌న్‌లో చూడొచ్చు.

ఆర్మీ కమాండెట్స్‌కు

మిల‌ట్రీ ట్రైనింగ్ కోసం కొత్తగా ఆర్మీలో జాయిన్ అయిన క‌మాండెట్స్‌కు ఎలాంటి శిక్ష‌ణ ఇస్తారు? ట్రైనింగ్‌లో వారు ఎదుర్కొనే క‌ఠిన స‌వాళ్లు ఏమిట‌నే పాయింట్‌తో ఈ సీరియ‌ల్ తెర‌కెక్కింది. ఫౌజీలో షారుఖ్‌ఖాన్ పాత్ర చిన్న‌దే అయినా అత‌డికి మంచి పేరుతెచ్చిపెట్టింది.

ఫౌజీ త‌ర్వాత దిల్ ద‌రియా, మ‌హాన్ క‌ర్జ్‌, దూస్రా కేవ‌ల్‌, ఇడియ‌ట్‌తో పాటు హిందీలో ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో షారుఖ్‌ఖాన్ న‌టించాడు. ఈ సీరియ‌ల్స్ ద్వారానే వ‌చ్చిన పేరుతోనే దీవానా సినిమాలో షారుఖ్‌ఖాన్‌కు అవ‌కాశం ద‌క్కింది. ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో షారుఖ్ ఖాన్ న‌ట‌న‌కు మంచి పేరు రావ‌డంతో ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. సినిమాల‌తో బిజీ కావ‌డంతో సీరియ‌ల్స్‌కు దూర‌మ‌య్యాడు.

సీరియ‌ల్‌కు సీక్వెల్‌…

ఫౌజీ సీరియ‌ల్‌కు సీక్వెల్ వ‌స్తోంది. ఫౌజీ 2 పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సీరియ‌ల్ షూటింగ్ ఇటీవ‌ల మొద‌లైంది. ఈ సీరియ‌ల్‌లో విక్కీ జైన్‌, గౌహ‌ర్ ఖాన్‌, ఉత్క‌ర్ష్ కోహ్లి, రుద్రా సోనీతో పాటు ప‌లువురు సీరియ‌ల్ ఆర్టిస్ట్‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఫౌజీ 2 సీరియ‌ల్‌ను సినిమాల‌కు ధీటుగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తోన్నారు.

ఈ సీరియ‌ల్‌లోని ఓ పాట‌ను సోను నిగ‌మ్ఆ ల‌పించ‌బోతున్నారు. ఈ సీరియ‌ల్‌కు శ‌ర‌ద్ ఖేల్క‌ర్ వాయిస్ ఓవ‌ర్ అందిస్తోన్నారు. ఫౌజీ 2 టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. కాగా షారుఖ్ ఖాన్ ఫౌజీ సీరియ‌ల్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు జియో సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024