TG CPGET 2024 Updates : టీజీ సీపీగెట్ ప్రవేశాలు – ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

Best Web Hosting Provider In India 2024

తెలంగాణలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్ -2024 కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఇటీవలనే రెండో ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా… తాజాగా అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్ 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. నవంబర్ 1వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. నవంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. నవంబర్ 4వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్ 8వ తేదీ సీట్లు కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఫేజ్ లో సీట్లు పొందిన అభ్యర్థులు.. నవంబర్ 12వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

టీజీ సీపీగెట్ ర్యాంక్ ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి :

  • పరీక్ష రాసిన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • సీపీగెట్ – 2024 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఓపెన్ అయ్యే విండోలో హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
  • మీ ర్యాంక్ కార్డ్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

తెలంగాణ సీపీగెట్ – 2024 (కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. మొత్తం 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా… ఇందులో 64,765 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 61,246 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో( ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు) 45 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ నిర్వహించారు.సీపీగెట్ పరీక్షలను జూలై 6వ తేదీ నుంచి కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించారు.జులై 17వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తి అయ్యాయి.

ఎంఈడీ ప్రవేశాలు – కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల:

మరోవైపు ఎంఈడీ, ఎంపీఈడీ ప్రవేశాలకు సంబంధించి కూడా ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 28వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. నవంబర్ 1వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది. నవంబర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. నవంబర్ 4వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్ 8వ తేదీ సీట్లు కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే అభ్యర్థులు.. నవంబర్ 12వ తేదీలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

AdmissionsEducationTelangana NewsOsmania UniversityTg Cpget
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024