OTT Trending Movies: ఓటీటీ ట్రెండింగ్‍లో టాప్‍కు కృతి సనన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. రెండో ప్లేస్‍లో కార్తి చిత్రం

Best Web Hosting Provider In India 2024

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల్లో ‘దో పత్తీ’కి స్పెషల్ క్రేజ్‍తో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్స్ కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ కూడా ఆకట్టుకోవటంతో ఈ చిత్రంపై క్యూరియాసిటీ నెలకొంది. అందుకు తగ్గట్టే స్ట్రీమింగ్‍కు వచ్చాక ‘దో పత్తీ’ మూవీ మంచి వ్యూస్ సాధిస్తోంది. మిక్స్డ్ టాక్ వచ్చినా ట్రెండింగ్‍లో దూసుకొచ్చేసింది.

టాప్‍లో ట్రెండింగ్

దో పత్తీ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ట్రెండింగ్‍లో టాప్‍లోకి వచ్చింది. ఇండియా ట్రెండింగ్‍లో ప్రస్తుతం (అక్టోబర్ 27) ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా శుక్రవారం అక్టోబర్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో రూపొందిన ఈ మూవీ తమిళం, తెలుగు, ఇంగ్లిష్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.

కృతిపై ప్రశంసలు

దో పత్తీ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని చూసిన చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. కృతి సనన్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీలో ఆమె డ్యుయల్ రోల్ చేశారు. కాజోల్, షాహిర్ షేక్ యాక్టింగ్‍ కూడా మెప్పించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, డైరెక్షన్, నరేషన్ విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది. ఈ చిత్రానికి శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కనికా థిల్లాన్ కథ అందించారు.

దో పత్తీ చిత్రాన్ని కథా పిక్చర్స్, బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్, విపిన్ అగ్నోహోత్రీ పతాకాలపై కనిక థిల్లాన్, కృతి సనన్ ప్రొడ్యూజ్ చేశారు. డ్యుయల్ రోల్ చేసిన కృతి.. ప్రొడ్యూజర్‌గానూ ఉన్నారు. ఈ మూవీకి అనురాగ్ సైకియ, సచెత్ – పరంపర, తనిష్క్ బాగ్చి మ్యూజిక్ ఇచ్చారు.

కార్తి సినిమా రెండో ప్లేస్‍లో..

తమిళ సూపర్ హిట్ సినిమా ‘మేయళగన్’ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అదరగొడుతోంది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‍లో రెండో ప్లేస్‍లో ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ సత్యం సుందరం కూడా స్ట్రీమింగ్‍కు వచ్చింది. అలాగే, మలయాళం, కన్నడ, హిందీలోనూ అందుబాటులో ఉంది. ఈ చిత్రం కూడా అక్టోబర్ 25వ తేదీనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

సత్యం సుందరం చిత్రానికి ‘96’ ఫేమ్ సీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంలో సెప్టెంబర్ 27న.. తెలుగులో ఒక రోజు తర్వాత థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు భాషల్లోనూ మంచి కలెక్షన్లు దక్కాయి. కార్తి, అరవింద్ స్వామి నటన మెప్పించింది. ఫీల్ గుడ్ మూవీగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

సత్యం సుందరం మూవీలో కార్తి, అరవింద్ స్వామితో పాటు శ్రీదివ్య, రాజ్ కిరణ్, దేవదర్శినీ, జయప్రకాశ్, శ్రీరంజనీ, ఇళవరసు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించారు. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య ఈ మూవీని నిర్మించారు.

అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, ప్రగ్యా జైస్వాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఖేల్ ఖేల్ మే మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం మూడో ప్లేస్‍లో ట్రెండింగ్‍లో ఉంది. ఆ కామెడీ డ్రామా మూవీకి ముదాసర్ అజీజ్ దర్శకత్వం వహించారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024