OTT Crime Thriller: ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. ట్విస్టులతో సాగే మూవీ

Best Web Hosting Provider In India 2024

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గోలం ఈ ఏడాది జూన్ 7న థియేటర్లలో రిలీజైంది. రంజిత్ సంజీవ్, దిలీశ్ పోతన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రాని సంజాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ముందుగా మలయాళంలో మాత్రమే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగుతో పాటు మరో మూడు భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.

స్ట్రీమింగ్ ఎక్కడ..

గోలం చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం మూవీకి నేడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల వెర్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా ఐదు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

ఈ ఏడాది ఆగస్టులో గోలం మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. అయితే, అప్పుడు మలయాళంతో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయినా మంచి వ్యూస్ సాధించింది. మరింత ఎక్కువ రీచ్ ఉండేందుకు ఇప్పుడు మరో నాలుగు భాషల్లోనూ ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియో అందుబాటులోకి తెచ్చింది.

ఓ హత్య కేసు దర్యాప్తు చుట్టూ గోలం మూవీ సాగుతుంది. గ్రిప్పింగ్ నరేషన్‍తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ సంజాద్ తెరకెక్కించారు. ఈ మూవీలో రంజిత్ సంజీవ్, దిలీశ్‍తో పాటు సన్నీ వైన్, అలెన్సియర్ లే లోపేజ్, సిద్దిఖీ, చిన్నూ చాందినీ, శ్రీకాంత్ మురళి, అన్సల్ పల్లరుతీ, సుధి కోజికోడ్ కీలకపాత్రలు పోషించారు.

గోలం మూవీని ఫ్రాగ్రెంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అన్నే సంజీవ్, సంజీవ్ పీకే ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి అబీ సాల్విన్ థామస్ సంగీతం అందించగా.. విజయ్ సినిమాటోగ్రఫీ చేశారు. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకుంది.

గోలం స్టోరీలైన్

వీటెక్ కంపెనీ ఎండీ ఇసాక్ జాన్ (దిలీశ్ పోతన్) తన రెస్ట్ రూమ్‍లో అనుమానాస్పదంగా చనిపోతాడు. తలుపు లోపలి నుంచి లాక్ వేసి ఉంటుంది. ప్రమాదవశాత్తు కిందపడి తలకు గాయమై ఇసాక్ చనిపోయాడని పోలీసులు ముందుగా భావిస్తారు. అయితే, ఇది ప్రమాదం కాదని హత్య అని ఏఎస్‍పీ సందీప్ (రంజిత్ సంజీవ్) భావిస్తాడు. ప్లాన్ చేసి అతడిని ఎవరో మర్డర్ చేశాడని అనుమానిస్తాడు. దీంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఇసాక్‍ మృతికి కారణం ఏంటి? హత్యకు గురయ్యాడా? మిస్టరీ ఏంటి? అనే అంశాలు గోలం స్టోరీలో ప్రధానంగా ఉంటాయి. ఈ మూవీలో నరేషన్, యాక్టర్ల పర్ఫార్మెన్స్‌లకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024