Iran Israel War : ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ క్షిపణి కర్మాగారాలు ధ్వంసం.. నలుగురు సైనికులు మృతి

Best Web Hosting Provider In India 2024


ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిలో భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. రాజధాని టెహ్రాన్‌కు సమీపంలో ఉన్న సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. శనివారం ఉదయం ఇజ్రాయెల్ 100కు పైగా క్షిపణులను ప్రయోగించింది. వాణిజ్య ఉపగ్రహ చిత్రం ప్లానెట్ ల్యాబ్స్ ప్రకారం, ఇజ్రాయెల్.. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ఇంధన మిక్సింగ్ కేంద్రాన్ని కూడా నాశనం చేసింది. ఇక్కడ ఆ దేశ మిస్సైల్‌లో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఇరాన్‌లోని క్షిపణుల గోదాముు కూడా ధ్వంసమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ భారీగా నష్టపోయింది.

టెహ్రాన్ సమీపంలోని సైనిక స్థావరం పూర్తిగా ధ్వంసమైందని ఐక్యరాజ్యసమితి మాజీ ఆయుధాల ఇన్స్పెక్టర్ డేవిడ్ ఆల్బ్రైట్, సీఎన్ఏ థింక్ ట్యాంక్ వాషింగ్టన్ విశ్లేషకుడు డెక్కర్ అవెలెత్ తెలిపారు. ఇక్కడ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్ క్షిపణి అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.

అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది. ఇజ్రాయెల్ విమానాలు క్షిపణి కర్మాగారాలను మూడు సార్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇజ్రాయెల్ విమానం రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయాలని భావించిందని ఇరాన్ సైన్యం తెలిపింది. అదే సమయంలో ఖోజిర్ భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు బయటకు వచ్చిన ఫోటోల్లో కనిపిస్తోంది. ఇక్కడే బాలిస్టిక్ క్షిపణుల ఇంధన మిక్సింగ్ జరుగుతుంది.

రాయిటర్స్ కథనం ప్రకారం ఈ భవనం శిథిలావస్థకు చేరినట్లు ఫొటోలు చెబుతున్నాయి. చుట్టూ దుమ్ము ఉంది. మండే స్వభావం ఉన్న ఇంధనం ఈ భవనంలో ఉంది. ఈ నేపథ్యంలో దాడి అనంతరం భీకరంగా మంటలు చెలరేగి చాలా వరకు ధ్వంసమైంది. ప్లానెట్ ల్యాబ్స్ చిత్రాల ప్రకారం ఇజ్రాయెల్ క్షిపణి ఇంధన మిక్సింగ్ సౌకర్యాలను ధ్వంసం చేసింది. దీంతోపాటు గోదామును కూడా ధ్వంసం చేశారు.

ఇప్పుడు దెబ్బతిన్న కర్మాగారం ఇరాన్ మిస్సైల్ కార్యక్రమానికి వెన్నెముకగా ఉంది. ఇది దెబ్బతినడంతో భారీగా ప్రభావం పడుతుంది. టెహ్రాన్‌లోని అణుశక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దెబ్బతీశారు. ఇప్పుడు ఆ ఇంధన మిక్సర్లను తిరికి అమర్చాలంటే రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. మరోవైపు నలుగురు సైనికులు కూడా మరణించినట్టుగా ఇరాన్ ఆర్మీ ప్రకటించింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link