Bigg Boss Today: సాయిపల్లవి, దుల్కర్ సహా సెలెబ్రిటీల క్యూ: దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో చూసేయండి.. ఎలిమినేట్ అతడే!

Best Web Hosting Provider In India 2024

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో నేడు (అక్టోబర్ 27) దీపావళి సెలెబ్రేషన్స్ జరగనున్నాయి. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. పలువురు సినీ స్టార్ల రాక, స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు, సరదా ఆటలు ఉండనున్నాయి. ఎనిమిదో వారం ఎలిమినేషన్ కూడా నేడే జరగనుంది. నేటి ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇదెలా ఉందంటే..

సినీ సెలెబ్రిటీలు వీరే.. మూడు చిత్రాల కోసం..

అమరన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు బిగ్‍బాస్‍కు వచ్చారు తమిళ హీరో శివ కార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా గెస్టుగా పాల్గొన్నారు. లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా ఈ ఎపిసోడ్‍కు హాజరయ్యారు. ‘క’ సినిమా ప్రమోషన్ కోసం హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్లు తన్విరామ్, నయన్ సారిక వచ్చారు. ఈ మూడు చిత్రాలు దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నాయి.

సాయిపల్లవి.. స్టార్ యాక్టర్

సాయి పల్లవిని హోస్ట్ కింగ్ నాగార్జున ప్రశంసించారు. “ఆడియన్స్ స్టార్స్, వీళ్లు యాక్టర్స్. కానీ స్టార్ యాక్టర్” అంటూ సాయిపల్లవిని నాగ్ చూపించారు. ఆ తర్వాత అవినాశ్‍పై నాగార్జున పంచ్ వేశారు. “వైఫ్ అనూ ఫొటో తెచ్చుకున్నాడు. హౌస్‍లో తాను చేసే పనులు తెలియకూడదని ఆ ఫొటో ఇలా మూసేస్తాడు” అని నాగ్ అన్నారు.

అనసూయ స్పెషల్ పర్ఫార్మెన్స్

సోగ్గాడే చిన్ని నాయనా పాటకు అనసూయ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. హౌస్‍మేట్స్ కూడా దుమ్మురేపారు. అనసూయను రెండు రాష్ట్రాల కుర్రాళ్లు లవ్ చేస్తున్నారంటూ అవినాశ్ అన్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్లకు ట్రెజర్ హంట్ గేమ్ ఉండనున్నట్టు చెప్పారు. అనసూయ అత్తారింటి మైథిలి భాష గురించి మాటలు సాగాయి. “మీ అత్తగారి భాష మీకే రాకపోతే మాకెలా అర్థమవుతుంది” రోహిణి పంచ్ వేశారు. దీంతో రోహిణి అనిపించుకున్నావని అనసూయ అన్నారు.

మనిషికి, మనీకి మధ్య లవ్ స్టోరీ

దుల్కర్ సల్మాన్‍తో ఎవరైనా లవ్ స్టోరీ చేస్తారనుకుంటామని డైరెక్టర్ వెంకీ అట్లూరిని నాగార్జున ప్రశ్నించారు. లక్కీ భాస్కర్ కూడా లవ్ స్టోరీనే అని, అయితే అది మనిషికి, మనీకి మధ్య అని వెంకీ చెప్పారు. తనకు డిఫరెంట్ మూవీ చేయాలని అనిపించి లక్కీ భాస్కర్ చేసినట్టు దుల్కర్ తెలిపారు. ఆ తర్వాత ఓ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది.

క్లైమాక్స్‌లో తెలుస్తుంది

తమ చిత్రానికి ‘క’ అని టైటిల్ ఎందుకు పెట్టారో క్లైమాక్స్‌లో తెలుస్తుందని కిరణ్ అబ్బవరం తెలిపారు. గంగవ్వ క్యూట్ అని హీరోయిన్ అంటే.. రాత్రి పూట చూడండి అంటూ రోహిణి పంచ్ వేశారు. కళ్లకు గంతలు కట్టుకొని కుక్కకు తోక గీసే టాస్కును కంటెస్టెంట్లకు నాగార్జున ఇచ్చారు. హైపర్ ఆది ఎంట్రీతో ఈ ప్రోమో ముగిసింది.

స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ టైమ్

బిగ్‍బాస్ 8 తెలుగు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ నేడు (అక్టోబర్ 27) సాయంత్రం 7 గంటల నుంచే స్టార్ మా ఛానెల్‍లో ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చూడొచ్చు.

ఎలిమినేట్ అతడే!

బిగ్‍బాస్‍లో నేడు ఎనిమిదో వారానికి గాను మహబూబ్ ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. తక్కువ ఓట్లు వచ్చిన మహబూబ్, నయని పావని డేంజర్ జోన్‍లో నిలిచారు. అయితే, చివరికి మహబూబ్ హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నాడని లీకులు వచ్చాయి. నేటి ఎపిసోడ్‍లో దీనిపై క్లారిటీ రానుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024