Hyderabad : జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ.. తొలుత మందు, విందు.. ఆ తర్వాత..

Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్ సమీపంలోని జన్వాడలోని ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ విషయం తెలిసి సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫాంహౌస్‌లో దాడులు చేశారు. భారీ శబ్ధాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు అక్కడకు వెళ్లారు.

అక్కడ తనిఖీలు నిర్వహించిన పోలీసులకు డ్రగ్స్ వాడినట్టు అనుమానం వచ్చింది. పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వారిలో విజయ్‌ మద్దూరి అనే వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారిలో 14 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

దాదాపు 30 ఎకరాల్లో ఈ ఫాంహౌస్ ఉంది. ముందస్తు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు.. రాజ్ పాకాలపై అనే వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. 10 లీటర్లకు పైగా అనుమతి లేని విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్లేయింగ్ కార్డ్స్, పోకర్, క్యాసినో వంటి వాటిని గుర్తించారు. ఫాంహౌస్‌లో దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.

ఈ రేవ్ పార్టీపై మంత్రి బండి సంజయ్ స్పందించారు. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీసీ పుటేజీ సహా.. ఇతర ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాల్సిందేనని స్పష్టం చేశారు.రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరిని అరెస్ట్ చేయాలని.. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలని వ్యాఖ్యానించారు.

అయితే.. ఈ జన్వాడ ఫామ్‌హౌస్‌ తెలంగాణలోని ఓ కీలక నేత బంధువుది అని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆ నేతను టార్గెట్ చేస్తూ.. కామెంట్స్ చేశారు.

Whats_app_banner

టాపిక్

Ts PoliceHyderabadCrime NewsParty FoodTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024