Makeup with Mehendi: పెదాలకు, ఐబ్రోలకు గోరింటాకుతో రంగు.. ఈ వైరల్ మేకప్ ట్రెండ్ మంచిదేనా

Best Web Hosting Provider In India 2024

సోషల్ మీడియాలో హెన్నా మేకప్ ఒకటి హల్ చల్ అవుతోంది. అంటే హెన్నా లేదా మెహందీతో మేకప్ అన్నమాట. పెదాలకు ఎరుపు రంగు కోసం ఎరుపు రంగు నిచ్చే మెహందీ, కను బొమ్మల నలుపు రంగు కోసం హెన్నా వడటం..ఇలా రకరకాలుగా హెన్నా వాడేస్తున్నారు. దాంతో మేకప్ చాలా సులవవుతుందని చెబుతున్నారు.

ఒక్కసారి పెదాలకు గోరింటాకు పెట్టుకుంటే కనీసం వారం దాకా అయినా లిప్‌స్టిక్ వేసుకోక్కర్లేదు. అలాగే నలుపు రంగు హెన్నా ఐబ్రోలకు పెట్టుకుంటే ఐబ్రో పెన్సిల్ వాడకుండానే కనుబొమ్మలు మందంగా కనిపిస్తాయట. కను రెప్పల మీద పెట్టుకుంటే ఐషాడో కూడా అక్కర్లేదు. మరి ఈ ట్రెండ్ నిజంగా పని చేస్తుందా తెల్సుకుందాం.

హెన్నా మేకప్ ట్రెండ్:

వైరల్ అవుతోన్న హెన్నా మేకప్ చూస్తే ఏ హాని లేనట్లే అనిపిస్తుంది. కానీ ఈ తాత్కాలికమైన రంగు వల్ల హాని కలుగుతుందని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. గోరింటాకులో పిపిడి అనే పారా ఫెనిలెనియామైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది తరచుగా ట్యాటూల కోసం వాడే బ్లాక్ హెన్నాలో ఉంటుంది. ఇది ఎలర్జీలు కలగజేసే కారకం. చాలా సమర్థవంతమైన నలుపు రంగు వచ్చేలా పనిచేస్తుందిది. దాంతో చర్మం మీద వాపు, దద్దుర్లు లాంటివి రావచ్చు. ఇది విపరీతమైన ఎలర్జీలకు కూడా కారణం అవ్వచ్చు.

సహజ గోరింటాకు సాధారణంగా సురక్షితం అయినప్పటికీ, దాని వాడకంతో అలెర్జీలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ముఖం మీద చర్మం చాలా పలుచగా, సున్నితంగా ఉంటుంది. ముందుగా తయారు చేసి పెట్టిన హెన్నా కోన్‌లలో సీసం వంటి హానికర పదార్థాలూ ఉంటాయి. దీంతో చర్మం మరింత దెబ్బతింటుంది. అందుకే ముఖానికి రాసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

హెన్నా ప్రమాదకర ప్రభావాలు:

గోరింటాకు మొక్క లేదా లాసోనియా మొక్క నుండి సహజ గోరింటాకు దొరుకుతుంది. దీంట్లో లాసోన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఆక్సీకరణ చర్య ద్వారా చర్మం,జుట్టుకు నారింజ-ఎరుపు రంగును అందిస్తుంది.

కానీ మార్కెట్లో లభించే గోరింటాకులో చాలా వరకు పారాఫెనిలెనెడియామైన్ (పిపిడి) వంటి రసాయనాలు ఉంటున్నాయి. ఇది సింథటిక్ సమ్మేళనం. సహజ గోరింటాకు లాగా నారింజ-ఎరుపు రంగు మాదిరిగా కాకుండా.. సింథటిక్ గోరింటాకులోని పిపిడి దురద, మంట, ఎరుపు, బొబ్బలు మరియు మచ్చలతో సహా తీవ్రమైన ప్రతికూల ప్రతిచర్యలకు కారణమవుతుంది.

ఈ హెన్నా వాడితే కాస్త మేలు:

సహజ గోరింటాకు చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకుపోయే అవకాశం తక్కువ. అందువల్ల సాధారణంగా ఈ ఎలర్జీలకు కారణం కాదు. ఇది సురక్షితమైన ప్రత్యామ్నాయం. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. చర్మాన్ని ఇన్ఫెక్షన్లు, మంట నుండి రక్షించడంలో సహాయపడుతుంది. సున్నితమైన చర్మంపై మేకప్ ట్రెండ్ ఫాలో అవ్వాలనుకునే వాళ్లు సహజ గోరింటాకును చాలా కొద్దిగా వాడొచ్చు. ఇది కాస్త అనుకూలమైన ఎంపిక. కానీ మీరూ ఈ ట్రెండ్ ట్రై చేయాలనుకుంటే మాత్రం రసాయనాలున్న ప్యాక్డ్ హెన్నా అస్సలు వాడొద్దని గుర్తుంచుకోండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024