Diwali Tollywood: దీపావళికి క్రేజీ అప్‍‍డేట్లు.. హరి హర వీరమల్లు పాట, బాలయ్య సినిమా టైటిల్, గేమ్ ఛేంజర్ టీజర్ సహా!

Best Web Hosting Provider In India 2024

దీపావళి పండుగ సమీపిస్తోంది. ఈసారి ఈ వెలుగుల పండుగకు టాలీవుడ్ నుంచి కొన్ని సినిమాల క్రేజీ అప్‍డేట్లు రానున్నాయి. చాలా రోజుల నుంచి వేచిచూస్తున్న చిత్రాల నుంచి కంటెంట్ రానుంది. దీపావళికి అప్‍డేట్ల జిగేల్స్ ఉండనున్నాయి. హరి హర వీరమల్లు, ఎన్‍బీకే109, గేమ్ ఛేంజర్, రాబిన్‍హుడ్ సినిమాల నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్‍లు రానున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీల్లో ఇవి వస్తాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

హరి హర వీరమల్లు పాట

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ దీపావళి సందర్భంగా రానుంది. ఈ పాటను పవన్ స్వయంగా ఆలపించారు. ఇది జానపద ఫ్లేవర్ ఉండే సాంగ్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా మిగిలిన పోర్షన్‍కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. దీపావళి సందర్భంగా ఈ వారం ఈ చిత్రం నుంచి పాట వచ్చేయనుంది. 2025 మార్చి 28న హరి హర వీరమల్లును రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ అప్పటికే ప్రకటించింది.

ఎన్‍బీకే109 టైటిల్ టీజర్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ (ఎన్‍బీకే109) చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ రానుంది. టైటిల్ రివీల్ అవనుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఇప్పటికే కన్పర్మ్ చేసింది. సంక్రాంతికి రిలీజ్‍ను కూడా ప్రకటించింది. అయితే, ఈ టైటిల్ టీజర్‌లో రిలీజ్ డేట్‍ను కన్ఫర్మ్ చేస్తుందేమో చూడాలి. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ టీజర్

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా నుంచి దీపావళికి టీజర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ, ఈ విషయంపై మూవీ టీమ్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, దసరాకే టీజర్ తీసుకురావాలనుకున్నా సాధ్యం కాలేదు. దీంతో దీపావళికి టీజర్ రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా ఈ దిశగా గతంలోనే హింట్ ఇచ్చారు. గేమ్ ఛేందర్ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పొటిలికల్ యాక్షన్ మూవీ 2025 జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

రాబిన్‍హుడ్ టీజర్

నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‍హుడ్ చిత్రం నుంచి దీపావళి సందర్భంగా టీజర్ రానుంది. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో దొంగ క్యారెక్టర్ చేస్తున్నారు నితిన్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే టీమ్ ఖరారు చేసింది. దీపావళికి రిలీజ్ చేసే గ్లింప్స్‌లో ఇదే డేట్ ఉంటుందా.. విడుదల తేదీలో ఏమైనా మార్పులు ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024