Kadapa BreakInspector: కడపలో బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌కు బుద్ది చెప్పిన లారీ డ్రైవర్లు.. వీడియో వైరల్..

Best Web Hosting Provider In India 2024

Kadapa BreakInspector: కడప ఆర్టీవో కార్యాలయంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌ విజయ భాస్కర్ రాజుపై ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లు తిరగబడటం వైరల్‌గా మారింది. జాతీయ రహదారిపై రాజస్తానీ దాబా వద్ద భోజన విరామం కోసం ఆగిన వాహనాలను తనిఖీలు చేసేందుకు వెళ్లిన బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌పై డ్రైవర్లు తిరగబడ్డారు.

ఆర్టీఓ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేయడానికి వెళ్లిన బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఓ డ్రైవర్‌ తాము ఏమి తప్పు చేశామంటూ నిలదీశాడు. హోటల్లోకి వచ్చి తనిఖీలు చేయడమేమిటని ప్రశ్నించారు. ఏపీ 03బిహెచ్‌ 2277 వాహనంలో తనిఖీలకు వచ్చిన బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ సమయంలో కనీసం యూనిఫాంలో కూడా లేరు. ఆ సమయంలో పదుల సంఖ్యలో ఉన్న లారీ డ్రైవర్లు ఆర్టీఓ సిబ్బందిని చుట్టుముట్టారు. ఐడీ కార్డు, యూనిఫాం కూడా లేకుండా ఎందుకు వచ్చారని నిలదీశారు. దీంతో ఆందోళనకు గురైన అధికారి అక్కడ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.

డ్రైవర్ల ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌పై కొందరు వాహనాల డ్రైవర్లు చేయి చేసుకున్నారు. తాము ఐడీ కార్డు ఏదని అడిగితే ఎందుకు వెళ్లిపోతున్నావని డ్రైవర్‌, సిబ్బందిని అడ్డుకున్నారు. అతను ఆర్టీవో అధికారి కాదని కేకలు వేస్తూ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించాలని స్థానికుల్ని కోరారు. ఈ మొత్తం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దాబా వద్ద తనిఖీలకు వచ్చిన బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ కడప ఆర్టీవో ఆఫీస్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్టు గుర్తించారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉండడంతో డ్రైవర్లు తిరగబడ్డారు. నిత్యం ఏదో ఒక సాకుతో తమ వాహనాలకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని డబ్బులు ముట్ట చెప్పితే గాని వాహనాలను వదిలిపెట్టడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

చర్యలకు ఆదేశించిన రవాణా మంత్రి

రవాణా శాఖ అధికారులు యూనిఫామ్ లేకుండా రోడ్డు పై కనబడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమ వసూళ్లు పాల్పడటం హేయమని, అధికారిని ప్రశ్నించడం పట్ల డ్రైవర్ల ఆవేదన అర్ధమవుతుందని పేర్కొన్నారు.

కడప ఆర్టీవో ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ భాస్కర్ రాజు అక్రమ డ్రైవర్లు వద్ద వసూళ్లకు పాల్పడుతూ ఉన్న వీడియో వైరల్ కావడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ఇటు వంటి అధికారుల పట్ల తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని , భవిష్యత్ లో మరో అధికారి ఇలాంటి చర్యలకు తావు ఇవ్వకుండా చర్యలు ఉంటాయని ప్రకటించారు.

రవాణా అధికారులు యూనిఫామ్ లేకుండా రోడ్డు పై కనబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రవాణా అధికారులు తమ శాఖకు పేరు తెచ్చేలా విధులు నిర్వహించాలని సూచించారు. బాధ్యుడైన అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Whats_app_banner

టాపిక్

KadapaGovernment Of Andhra PradeshTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024