AP Liquor Scam : ఏపీలో లిక్కర్ స్కామ్.. అర్ధరాత్రి వరకు సీఐడీ సోదాలు.. కీలక రికార్డులు స్వాధీనం

Best Web Hosting Provider In India 2024

గతంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యవహారంలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని సీఐడీకి అప్పగించింది.

దీంతో సీఐడీ దూకుడుగా వెళ్తోంది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు డిస్టిలరీలు, షుగర్ ఫ్యాక్టరీలు, బ్రూవరీస్‌లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒకేసారి 18చోట్ల సీఐడీ ఆఫీసర్లు తనిఖీలు చేశారు. అర్ధరాత్రి వరకు సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కీలక రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

సోదాలు చేసిన పరిశ్రమల నుంచి డిస్టిలరీలకు స్పిరిట్, పోర్టబుల్‌ ఆల్కహాల్, ఇథనాల్, ఇథైల్, మొలాసిస్‌ ఎంత సరఫరా చేశారనే వివరాలు సేకరించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌ బీరు పరిశ్రమలో అధికారులు ఏకంగా 12 గంటలు తనిఖీలు చేశారు. సోదాలు పూర్తయ్యేవరకూ బయట నుంచి ఎవరినీ అనుమతించలేదు.

18 ప్రాంతాల్లో..

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలోని క్రక్స్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్‌, కృష్ణా జిల్లా ఉయ్యూరులోని కేసీపీ షుగర్స్‌, కంచికచర్లలోని సెంచురీ బయోప్రొడక్ట్స్‌, కాకినాడ జిల్లా పెద్దాపురంలోని చినబ్రహ్మదేవంలోని కేబీకే బయోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌, కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరు సమీపంలోని సర్వారాయ షుగర్స్‌ కంపెనీలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

రామచంద్రపురంలోని ఆర్టోస్‌బ్రూవరీస్‌ లిమిటెడ్‌, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలోని కాప్రికార్న్‌ డిస్టిలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, తుపాకులగూడెంలోని బీ9 బ్రూవరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిధిలోని ఆంధ్రా షుగర్స్‌, నల్లజర్ల మండలం ఆవుపాడు శివారులో ఎంఎస్‌ బయోటెక్‌ డిస్టిలరీలో సీఐడీ తనిఖీలు చేసింది.

నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్‌, నెల్లూరు జిల్లా సర్వేపల్లిలోని ఎస్‌ఎన్‌జే బ్రూవరీస్‌ లిమిటెడ్‌, ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పెరల్‌ బ్రూవరీస్‌, చిత్తూరు జిల్లా తిమ్మసముద్రంలోని ఎస్‌ఎన్‌జే షుగర్స్‌‌లోనూ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Whats_app_banner

టాపిక్

LiquorLiquor ScamExcise PolicyTrending ApAp Cid
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024