Best Web Hosting Provider In India 2024
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి రావడం అదృష్టంగా భావిస్తున్నానని.. బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. ఈ పదవిలో తనను నియమించినందుకు ఎన్డీయే పెద్దలకు, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుమలలో పనిచేసే వారంతా హిందువులే అయి ఉండాలని.. బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తిరుమలలో ఎన్నో అరాచకాలు చేసిందని విమర్శించార ఆరోపించారు. అందుకే గత ఐదేళ్లలో తిరుమల వెళ్లలేదని వివరించారు. కొండపై పవిత్రత లేకపోయేసరికి బాధపడ్డానని వ్యాఖ్యానించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు.
24 మందితో బోర్డు..
టీటీడీ పాలకమండలి నియామకం పూర్తయింది. కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. బీఆర్ నాయుడు సహా మొత్తం 24 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు కానుంది.
బోర్డు సభ్యులు వీరే..
బీఆర్ నాయుడు- టీటీడీ ఛైర్మన్
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) – టీటీడీ సభ్యులు
ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే) – టీటీడీ సభ్యులు
ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే) – టీటీడీ సభ్యులు
పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి) – టీటీడీ సభ్యులు
సాంబశివరావు (జాస్తి శివ) – టీటీడీ సభ్యులు
శ్రీసదాశివరావు నన్నపనేని – టీటీడీ సభ్యులు
కృష్ణమూర్తి – టీటీడీ సభ్యులు
కోటేశ్వరరావు – టీటీడీ సభ్యులు
మల్లెల రాజశేఖర్ గౌడ్ – టీటీడీ సభ్యులు
జంగా కృష్ణమూర్తి – టీటీడీ సభ్యులు
దర్శన్. ఆర్.ఎన్ – టీటీడీ సభ్యులు
జస్టిస్ హెచ్‌ఎల్ దత్ – టీటీడీ సభ్యులు
శాంతారామ్ – టీటీడీ సభ్యులు
పి.రామ్మూర్తి – టీటీడీ సభ్యులు
జానకీ దేవి తమ్మిశెట్టి – టీటీడీ సభ్యులు
బూంగునూరు మహేందర్ రెడ్డి – టీటీడీ సభ్యులు
అనుగోలు రంగశ్రీ – టీటీడీ సభ్యులు
బురగపు ఆనందసాయి – టీటీడీ సభ్యులు
సుచిత్ర ఎల్లా – టీటీడీ సభ్యులు
నరేశ్‌కుమార్ – టీటీడీ సభ్యులు
డా.అదిత్ దేశాయ్ – టీటీడీ సభ్యులు
శ్రీసౌరబ్ హెచ్ బోరా – టీటీడీ సభ్యులు
టాపిక్