Best Web Hosting Provider In India 2024
31 Oct 2024 12:19 PM
పోలీస్ స్టేషన్లో గుండెపోటు
తిరుపతి: వైయస్ఆర్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు ఆగడం లేదు. తిరుపతి జిల్లా కోట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ప్రసాద్గౌడ్ను పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో ఉండగానే ప్రసాద్గౌడ్కు గుండెపోటు రావడంతో వైయస్ఆర్సీపీ శ్రేణులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసుల తీరుపై వైయస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.