Vettaiyan OTT Official: ఎట్టకేలకు ఓటీటీలోకి రజనీకాంత్ వేట్టయన్.. అధికారిక ప్రకటన.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Vettaiyan OTT Release Official: సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన వేట్టయన్ మూవీకి టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించారు.

స్టార్ హీరోలు

రజనీకాంత్ మెయిన్ హీరోగా యాక్ట్ చేసిన వేట్టయన్‌లో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి విలన్‌గా నటించాడు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మలయాళ పాపులర్ యాక్టర్, పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషరా విజ‌య‌న్ త‌దిత‌రులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

భారీ ఆశలు

ఎంతోమంది స్టార్ యాక్టర్స్ ఉన్న సినిమా కావడంతో వేట్టయన్‌పై భారీగా అంచనాలు పెరిగాయి. అలాగే, సినిమా విడుదలకు ముందు విడుదలైన మనసులాయే పాట సూపర్ క్రేజ్ తెచ్చకుంది. దాంతో రజనీకాంత్‌ మూవీపై అభిమానులు, ఆడియెన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో అంచనాలతో దసరా కానుకగా అక్టోబర్ 10న వేట్టయన్ మూవీ థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

మిక్స్‌డ్ టాక్

అయితే, వేట్టయాన్ సినిమాకు మిక్స్‌డ్ టాక్, రివ్యూల వచ్చాయి. సోషల్ మేసేజ్ ఉన్న వేట్టయన్ మూవీ కాస్తా స్లోగా, బోరింగ్‌గా తెరకెక్కించారని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. స్టోరీ బాగానే ఉన్న టేకింగ్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదని టాక్ వినిపించింది. కాకపోతే రజనీతోపాటు ఇతర యాక్టర్స్ నటన అదిరిపోయిందని, అక్కడ గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయని రివ్యూలు ఇచ్చారు.

దివాళీ సందర్భంగా

ఇక వేట్టయన్ ఓటీటీ రిలీజ్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలో వేట్టయన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని చాలా రూమర్స్ వినిపించాయి. కానీ, ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం వెలువడలేదు. తాజాగా అనూహ్యంగా దివాళి సందర్భంగా ఇవాళ (అక్టోబర్ 31) వేట్టయాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

240 దేశాల్లో ఓటీటీ రిలీజ్

రజనీకాంత్ వేట్టయన్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. నవంబర్ 8 నుంచి 240 దేశాల్లో వేట్టయన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని అమెజాన్ ప్రైమ్ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇంకా 8 రోజులు సమయం ఉన్న వేట్టయన్ ఓటీటీలో తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

బడ్జెట్-కలెక్షన్స్

కాగా, ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానున్న వేట్టయన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే, వేట్టయన్ సినిమాను రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అంటే, టాక్ పరంగా ఎలా ఉన్న బాక్సాఫీస్ పరంగా వేట్టయన్ లాభాలు అందుకుని కమర్షియల్ సక్సెస్ సాధించింది.

నాలుగో సినిమా

ఇదిలా ఉంటే, వేట్టయన్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. రోబో 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీ కాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్ష్ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా వేట్టయన్ కావడం విశేషం.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024