Roti Kapada Romance: అర్జున్ రెడ్డి సాంగ్ పెట్టవా ప్లీజ్.. ఫుల్లీ రొమాంటిక్‌గా రోటి కపడా రొమాన్స్ (వీడియో)

Best Web Hosting Provider In India 2024

Roti Kapada Romance Trailer Release: హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన సరికొత్త సినిమా రోటి కపడా రొమాన్స్. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ రెడ్డి దర్శకుడు.

రొమాంటిక్‌గా ట్రైలర్

ఈ సినిమాలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబరు 22న రిలీజ్ కానున్న రోటి కపడా రొమాన్స్ ట్రైలర్‌ను తాజాగా నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. రెండు నిమిషాల 48 సెకన్స్ ఉన్న ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం రొమాంటిక్‌గా ఉంటూ ఆకట్టుకుంది.

అర్జున్ రెడ్డి సాంగ్

ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ చాలా బాగున్నాయి. అలాగే యూత్ మెచ్చే రొమాంటిక్ సీన్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సాంగ్ (మధురమే పాట) పెట్టవా ప్లీజ్.. అని హీరో హీరోయిన్ ఇంటిమేట్ అవ్వడానికి ఇచ్చే హింట్ హైలెట్‌గా నిలిచింది. అలాగే, హ్యాపీగా ఉన్న లైఫ్‌లోకి అమ్మాయిలు వచ్చి ఇంటర్‌స్టెల్లార్ సినిమా చూపించి వెళ్తారు అని చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

రొమాన్స్, బ్రేకప్

నేటి జనరేషన్‌కి తగినట్లుగా రొమాన్స్, కామెడీ, లవ్, బ్రేకప్ అంశాలతో రోటి కపడా రొమాన్స్ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇదిలా ఉంటే, రోటి కపడా రొమాన్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సెన్సేషనల్ హిట్

“రోటి కపడా రొమాన్స్‌ ట్రైలర్‌ చూశాను. న్యూ టాలెంట్‌ చాలా మందిని ఈ సినిమాలో చూడటం ఆనందంగా ఉంది. అందరిలో మంచి ఎనర్జీ కనిపించింది. అందరికి విష్‌ యు ఆల్‌ ద బెస్ట్‌. ప్రతి సంవత్సరం యంగ్‌ జనరేషన్‌ చేసిన సినిమా సెన్సేషన్‌ హిట్‌ అవుతుంది. ఈ సినిమా కూడా ఆ కోవలో చేరాలని కోరుకుంటున్నాను” అని నాని అన్నారు.

మరింత మందికి సపోర్ట్

“ఈ సినిమా అందరికి మంచి గుర్తింపు తీసుకు రావాలి. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ ఎప్పూడూ న్యూ టాలెంట్‌ను ఎంకరైజ్‌ చేస్తూ కొత్తవాళ్లకు అవకాశం ఇస్తుంటాడు. ఇలాంటి నిర్మాతలు సక్సెస్‌ కావాలి. వాళ్లు సక్సెస్‌ అయితే న్యూ టాలెంట్‌ను మరింత మందిని సపోర్ట్‌ చేస్తాడు. ట్రైలర్ చూస్తే సినిమాలో చాలా డెప్త్‌ కనిపిస్తుంది. యూత్‌కు కొత్తగా ఎదో చెప్పాలనే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడిగా విక్రమ్‌ రెడ్డికి సక్సెస్‌ రావాలి. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా ఉండాలి” అని నాని కోరారు.

యూత్‌కు కనెక్ట్ అయ్యేలా

సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “కొత్త టాలెంట్‌ను ఎప్పుడూ ప్రోత్సహించే నాని చేతుల మీదుగా మా ట్రైలర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. నేటి యువతరంకు నచ్చే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రంలోని ప్రతి పాత్ర అందరికి ప్రతి యూత్‌కు కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుంది” అని తెలిపారు.

ప్రధాన బలాలు

“రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. కొంత మందికి ఈ చిత్రం షోస్‌ వేసి చూపించాం. సినీ పరిశ్రమలో ఈ సినిమా గురించి మంచి టాక్‌ ఉంది” అని నిర్మాతలు పేర్కొన్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024