OTT K-Dramas: ఓటీటీల్లోకి నవంబర్ నెలలో రాబోతున్న టాప్ కొరియన్ డ్రామాస్ ఇవే..

Best Web Hosting Provider In India 2024

OTT K-Dramas: కొరియన్ డ్రామాస్ కు ఇండియాలోనూ అభిమానులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు సరికొత్త కే-డ్రామాస్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నవంబర్ నెలలోనూ అలాంటి ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ రానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, రాకుటెన్ వికీలాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు.

నవంబర్‌లో రానున్న కొరియన్ డ్రామాస్ ఇవే

గాంగ్నమ్ బీ-సైడ్ – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

గాంగ్నామ్ బీ-సైడ్ ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ నవంబర్ 6 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఓ వేశ్య కనిపించకుండా పోవడం.. ఆ కేసును ఓ డిటెక్టివ్ ఛేదించడానికి చేసే ప్రయత్నం చుట్టూ ఈ గాంగ్నమ్ బీ-సైడ్ వెబ్ సిరీస్ తిరుగుతుంది.

ప్లాంక్టన్ – నెట్‌ఫ్లిక్స్

ప్లాంక్టన్ ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్. 10 ఎపిసోడ్ల ఈ సిరీస్ నవంబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. జీవితంపై విరక్తితో హే జో అనే వ్యక్తి చివరి ప్రయాణానికి సిద్ధమవుతాడు. అక్కడ అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎదురవుతుంది. ఓ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఆమె పారిపోతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయో ఈ సిరీస్ లో చూడొచ్చు.

ది ఫియరీ ప్రీస్ట్ సీజన్ 2 – హాట్‌స్టార్

ది ఫియరీ ప్రీస్ట్ ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇప్పుడు సీజన్ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓ డ్రగ్ కేసును ఛేదించడానికి ప్రయత్నించే కొందరు డిటెక్టివ్ ల చుట్టూ తిరిగే కథ ఇది.

వెన్ ద ఫోన్ రింగ్స్ – నెట్‌ఫ్లిక్స్

వెన్ ద ఫోన్ రింగ్స్ (When the phone rings) ఓ క్రైమ్ వెబ్ సిరీస్. కొరియాలో అత్యంత పిన్న వయసులో ప్రెసిడెంట్ అధికార ప్రతినిధిగా మారిన బేక్ సా-ఇయోన్, సైన్ లాంగ్వేజ్ ఎక్స్‌పర్ట్ అయిన హాంగ్ హుయి-జు అనే జంట చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

బ్రూయింగ్ లవ్ – రాకుటెన్ వికీ

బ్రూయింగ్ లవ్ (Brewing Love) అనేది ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్. 12 ఎపిసోడ్ల ఈ సిరీస్ నవంబర్ 4 నుంచి రాకుటెన్ వికీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇది ఓ మాజీ మిలిటరీ ఆఫీసర్ అయిన యాంగ్ జు అనే అమ్మాయికి, ఓ బ్రూవరీ కంపెనీ సీఈవో యున్ మిన్-జు అనే అబ్బాయి మధ్య సాగే ప్రేమ కథ.

ఫేస్ మి – రాకుటెన్ వికీ

ఫేస్ మి ఓ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది కూడా నవంబర్ 6 నుంచి రాకుటెన్ వికీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. 12 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్.. కొన్ని హింసాత్మక నేరాలను ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో ఓ ప్లాస్టిక్ సర్జన్, డిటెక్టివ్ మధ్య చిగురించే ప్రేమ చుట్టూ తిరుగుతుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024