Tirumala : భక్తులకు TTD అలర్ట్… తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ-వేలం, ఇలా దక్కించుకోవచ్చు

Best Web Hosting Provider In India 2024


తిరుమల శ్రీవారి వస్త్రాల ఈ- వేలానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన జారీ చేసింది. శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను నవంబర్ 4 నుంచి వేలం వేస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 11 తేదీ వరకు ఈ – వేలం ఉంటుందని పేర్కొంది. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 358 లాట్లు ఉన్నాయని వివరించింది.

ఇందులో ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ దోతీలు, ఉత్తరీయాలు, ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ /నైలాన్ /నైలెక్స్ చీరలు, ఆఫ్ చీరలు, క్లాత్ బిట్స్‌, బ్లౌజ్‌పీస్‌లు, ఉత్త‌రీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, శాలువ‌లు, బెడ్‌షీట్లు, హుండీ గ‌ల్లేబులు, దిండుక‌వ‌ర్లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళం కార్పెట్లు, దుప్ప‌ట్లు, క‌ర్ట‌న్లు, గ‌ర్భ‌గృహ కురాళాలు, బంగారువాకిలి ప‌ర‌దాలు, శ్రీవారి గొడుగులు ఉన్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ లేదా… టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org , www.konugolu.ap.govt.in సంప్రదించవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.

శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం:

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ… శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు.

శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించినట్టు తెలిపారు.

అంత‌కుముందు ఆల‌యంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మ‌వార్లు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

విశేష పర్వదినాలు:

తిరుమలలో నవంబరు నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ప్రకటించింది. వాటి వివరాలు ఇక్కడ చూడండి….

•⁠ ⁠నవంబరు 1న కేదారగౌరీ వ్రతం

•⁠ ⁠నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర

•⁠ ⁠నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.

•⁠ ⁠నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర

•⁠ ⁠నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ

•⁠ ⁠నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర

•⁠ ⁠10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం

•⁠ ⁠నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి

•⁠ ⁠నవంబరు 12న ప్రబోధన ఏకాదశి

•⁠ ⁠నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి

•⁠ ⁠నవంబరు 15న కార్తీక పౌర్ణమి

•⁠ ⁠28న ధన్వంతరి జయంతి

•⁠ ⁠29న మాస శివరాత్రి

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

TtdDevotionalDevotional NewsAndhra Pradesh NewsTirumala
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024