Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి అంబటి రాంబాబు
గుంటూరు: కూటమి ప్రభుత్వం అధికికారంలోకి వచ్చాక ప్రజావైద్యాన్ని గాలికి వదిలేసింది. నిత్యం వందలాది మంది రోగులు వచ్చే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో వసతులు కరువయ్యాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇవాళ ఆసుపత్రిని సందర్శించిన ఆయన అక్కడి వసతులపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రి ICU లో AC లు పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. తక్షణమే చర్య తీసుకోవలసిందిగా
ఆయన కోరారు.
కాగా, సీఎంగా వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు(అర్బన్ పీహెచ్‌సీలు)గా మార్చారు. వీటిల్లో అన్ని వసతులనూ సమకూర్చారు. స్పెషాలిటీ వైద్యమూ అందించేలా చర్యలు చేపట్టారు. దీనికోసం స్పెషాలిటీ వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని కేడర్ల వైద్యసిబ్బంది నియామకాలనూ పూర్తిచేసింది. వీటిల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యసిబ్బంది ఉచిత సేవలు అందిస్తున్నారు. పట్టణంలో ప్రతి ఇంటికీ పది నిమిషాల నడక దూరంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలనే లక్ష్యంతో ప్రతి 25వేల జనాభాకూ ఓ కేంద్రం చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 అర్బన్ పీహెచ్‌సీలను కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది.