Aghori in Vemulawada : వేములవాడ లో నాగసాదు అఘోరీ హల్ చల్ – ఆత్మార్పణం అంటూ సంచలన ప్రకటన

Best Web Hosting Provider In India 2024

కారు లో పుర్రేలు పెట్టుకుని దిగంబరంగా తెలంగాణలో పర్యటించిస్తున్న నాగసాదు అఘోరీ వేములవాడ లో హల్ చల్ చేశారు. రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులయితే రాజన్న ఆలయ ఆవరణలోని దర్గాను కూల్చి వేయండని సూచించారు. హిందూధర్మం కాపాడేందుకు శుక్రవారం ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించారు. కారులో పెట్రోల్ క్యాన్ పెట్టుకుని తిరగడం కలకలం సృష్టిస్తుంది.

మాది మంచిర్యాల అని, ఎప్పుడో చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్ళి అఘోరీగా మారానని తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్న నాగసాదు సంచలనం సృష్టిస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆలయాలను సందర్శించి దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 

ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన నాగసాదు అఘోరీ హరిహర మహాదేవ అంటూ ఆలయం ఆవరణలోని దర్గా ను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. హిందువులైతే రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. చీపురుతో కొట్టించుకునే దరిద్రం మనకెందుకని ప్రశ్నించారు. చాలా ఏళ్ళ నుంచి దర్గా ఉంది కదా.. ఇప్పుడెందుకు అభ్యంతరమని మీడియా ప్రశ్నిస్తే కాశీలో కూడా ఉంది.. ఏమైందో చూశారుగా.. ఇప్పుడు ఉందా అని ఎదురు ప్రశ్న వేశారు. తాను ముస్లీంలకు వ్యతిరేకం కాదంటూనే ఫస్ట్ దర్గాను తొలిగించి మాట్లాడడండని అన్నారు. లేకుంటే ఏం జరుగుతుందో చూడండని అన్నారు. సనాతన ధర్మం కాపాడేందుకు తనవంతు కృషి చేస్తున్నానని తెలిపారు.

శుక్రవారం ఆత్మార్పణం..!

శుక్రవారం ఏడుపాయల వనదుర్గమాతను దర్శించుకున్న అనంతరం ఆత్మార్పణ చేస్తానని నాగసాదు అఘోరీ ప్రకటించారు. రేపు సికింద్రాబాద్ లో ఏం జరుగుతుందో చూస్తారు కదా అన్నారు. దర్శనం అనంతరం కారులో పెట్రోల్ క్యాన్ తో తిరుగు ప్రయాణం అయి కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఏడుపాయల వన దుర్గమాతను దర్శించుకుంటానని తెలిపారు.

దిగంబరంగా తెలంగాణలో పర్యటిస్తున్న నాగసాదు అఘోరీని వేములవాడలో భక్తులు ఆసక్తిగా చూశారు. కొందరు భక్తులు భక్తిభావంతో నాగసాదుకు పాదాభివందనం చేశారు. ఆత్మార్పణం చేసుకోవద్దని వేడుకున్నారు. ఒంటిపై నూలు పోగు లేకుండా ఆలయాలను సందర్శిస్తున్న నాగసాదు అఘోరీని ఆసక్తిగా ప్రజలు గమనిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో నాగసాదు అఘోరీ ఇంటర్వ్యూలు పొంతనలేని సమాధానాలు వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

టాపిక్

Telangana NewsKarimnagarViral Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024