Matrimony Fraud : మ్యాట్రిమోని ఫేక్ ప్రొఫైల్ లో అందమైన అమ్మాయిల ఫొటోలు, యువకుల నుంచి లక్షలు కొట్టేస్తున్న జంట

Best Web Hosting Provider In India 2024

మ్యాట్రిమోని డాట్ కామ్ పేరుతో యువకులను ఆకర్షించి మోసం చేసే దంపతుల గుట్టురట్టయింది. అందమైన ఫొటోలు అప్ లోడ్ చేసి సైబర్ నేరాలకు తెరతీసిన ఆలుమగల ఆట కట్టించారు రామగుండం కమిషనరేట్ పోలీసులు. ఇద్దరిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం హరిపురం గ్రామానికి చెందిన రామంచ సౌజన్య, ఏలూరు జిల్లా అశోక్ నగర్ కు చెందిన ఎర్ర వెంకటనాగరాజు ఇద్దరు భార్యాభర్తలు. వీరిద్దరూ నయా మోసానికి తెరలేపారు.‌ తెలుగులో మ్యాట్రిమోని వెబ్ సైట్ ఏర్పాటు చేసి వారి సెల్ ఫోన్ నెంబర్ తో అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రో ఫైల్ క్రియేట్ చేసి అందమైన అమ్మాయిల ఫొటోలు అప్లోడ్ చేస్తూ అబ్బాయిలకు రిక్వెస్ట్ పంపించేవారు. ఎవరైనా స్పందిస్తే వారి దగ్గర నుంచి మోసపూరితంగా డబ్బులు వసూలు చేసేవారు.‌ అందమైన అమ్మాయిల ఫొటోలు చూసి ఆకర్షితులైన అబ్బాయిలు ఆ అమ్మాయిని చూద్దాం అంటే వారి అమ్మకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ లో ఉందని హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు కావాలని మాయమాటలు చెప్పి దంపతులు డబ్బులు వసూలు చేసేవారు.

రూ.17 లక్షలు మోసపోయిన మంచిర్యాల యువకుడు

మ్యాట్రిమోని పేరుతో దంపతులు పంపిన అందమైన అమ్మాయి ఫొటోకు ఆకర్షితుడై మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడు మోసపోయాడు. గత నెల 5న దంపతులు చెప్పిన మాటలు నమ్మి 17 లక్షల రూపాయలు పంపించాడు. నెలరోజులు అయినా అమ్మాయిని చూపించక పోవడంతో మోసపోయానని గ్రహించిన యువకుడు రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. డీజీ షికా గోయల్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ డీఎస్పీ ఎం.వెంకటరమణ విచారణ చేపట్టగా దంపతుల నయా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులిద్దరినీ గుర్తించి పెద్దపల్లి జిల్లా హరిపురంలో అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు.

వెబ్ సైట్ రిక్వెస్ట్ లకు స్పందించవద్దు

ప్రస్తుతం అరెస్టు అయిన దంపతులు బారిన ఒక యువకుడే పడ్డాడ, ఇంకా ఎవరైనా ఉన్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే రిక్వెస్ట్ లకు వెబ్సైట్లో వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని రామగుండం సీపీ శ్రీనివాస్ కోరారు.‌ నమ్మకమైన, గుర్తింపు పొందిన వెబ్ సైట్లో అయితేనే స్పందించాలి తప్ప అనవసరమైన రిక్వెస్ట్ లకు స్పందిస్తే ఇలాంటి సైబర్ మోసాలకు గురి కాక తప్పదని హెచ్చరించారు. మ్యాట్రిమోని డాట్ కామ్ అనే వెబ్ సైట్ లో గుర్తు తెలియని వ్యక్తుల పంపించే రిక్వెస్ట్ లకు స్పందించి సైబర్ మోసాలకు గురికావద్దని రామగుండం సైబర్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ వెంకటరమణ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే మోసాల బారి నుంచి బయటపడచ్చని సూచించారు. దంపతులు ఒక్క మోసానికే పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు ప్రకటించారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsCybercrimePeddapalliKarimnagarCrime Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024