Best Web Hosting Provider In India 2024
Bigg Boss Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి తొమ్మిదో వారంలో నయని పావని ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం నామినేషన్స్‌లో నయని పావనితో పాటు గౌతమ్, యష్మి, హరితేజ ఉండగా…ముగ్గురిని సేవ్ చేసిన నాగార్జున నయని పావని ఎలిమినేట్ అవుతోన్నట్లుగా సండే ఎపిసోడ్‌లో ప్రకటించాడు.
నామినేషన్స్‌లో ఉన్న వారిలో యష్మి, గౌతమ్‌లకు ఎక్కువగా ఓట్లు పడ్డట్లు తెలిసింది. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతూ సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించడమే నయని పావని ఎలిమినేషన్‌కు కారణమని తెలుస్తోంది.
డమ్మీ ప్లేయర్లు వీళ్లే…
హౌజ్ నుంచి బయటకు వచ్చిన నయని పావనిని హౌజ్‌లో ఉన్న ఐదుగురు డమ్మీ ప్లేయర్లు, ముగ్గురు బెస్ట్ ప్లేయర్స్ ఎవరో చెప్పాలని నాగార్జున అడిగాడు. గంగవ్వ, రోహిణి, ప్రేరణ, గౌతమ్‌తో పాటు విష్ణుప్రియలను డమ్మీ ప్లేయర్లుగా నయని పావని చెప్పింది. ప్రేరణను కోపం ఎక్కువని, ఆమె మాటల వల్ల ఎదుటివాళ్లు బాధపడుతున్నారని అదే ప్రేరణకు నెగెటివ్‌గా మారుతుందని అన్నది.
విష్ణుప్రియలో గేమ్ ఆడే ఫైర్ ఉందని, కానీ సరిగ్గా ఆడలేక డమ్మీ ప్లేయర్‌గా మారిపోతుందని నయని పావని చెప్పింది. రోహిణి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని అన్నది. మనం ఒకరి దగ్గర నుంచి ఏదైనా కోరుకుంటే మనం కూడా అది ఇవ్వాలి గౌతమ్ గురించి చెప్పింది.
పృథ్వీ జెన్యూన్…
బెస్ట్ కంటెస్టెంట్స్‌గా నిఖిల్, పృథ్వీ, హరితేజ పేర్లు చెప్పింది. నిఖిల్ కోపం ఎక్కువే కానీ అతడిది చిన్న పిల్లాడి మనస్తత్వమని నయని పావని అన్నది. హౌజ్ మొత్తంలో జెన్యూన్ కంటెస్టెంట్ పృథ్వీ మాత్రమేనని ట్యాగ్ ఇచ్చింది నయని పావని. హరితేజలో ఫైర్ ఎక్కువగా ఉందని అన్నది. ఈ వారం కూడా బాగా ఆడాలని సలహా ఇచ్చింది.
రివేంజ్….
ఈ వారం నామినేషన్స్ కోసం బిగ్‌బాస్ ఏసీ టాస్క్ ఇవ్వనున్నట్లు ప్రోమోలో చూపించారు. నామినేషన్స్ ప్రక్రియలోకంటెస్టెంట్స్ రివేంజ్ తీర్చుకోబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటే కనిపిస్తోంది. నిఖిల్- గౌతమ్, ప్రేరణ- హరితేజ పోటాపోటీగా ఒకరిని మరొకరు నామినేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుస్తోంది. యష్మి, గౌతమ్ మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలపై సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది.
ఐదుగురు సేఫ్…డేంజర్ జోన్‌లో…
గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి, యష్మి నామినేషన్స్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ వీక్ తమ ఆటతీరుతో అదరగొట్టారు. విష్ణుప్రియ, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్, హరితేజ, నామినేషన్స్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
హరితేజ డేంజర్ జోన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ వీక్ ఆమె బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత వీక్ హరితేజ ఆటతీరు ఏమంత గొప్పలేదు. అదే ఆమెకు మైనస్ కానున్నట్లు చెబుతోన్నారు.